ఈశాన్య చైనాలోని డాలియన్‌ సిటీలోని (Dalian City) మార్కెట్‌ దిగువన ఉన్న అండర్‌ గ్రౌండ్‌లో మంటలు చెలరేగి (Underground Fire)..9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.  ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కాలంలో అగ్ని ప్రమాద ఘటనలు పెరిగిపోయాయి. షాట్ సర్క్యూట్, ప్రమాదవశాత్తు, ఇతర కారణాల వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకుని..భారీ మెుత్తంలో ఆస్తి నష్టం సంభవిస్తోంది. గత జూలైలో ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లోని ఒక గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవించి..14 మంది మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. జూన్‌లో సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని (Henan province) మార్షల్ ఆర్ట్స్ బోర్డింగ్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 18 మంది మరణించారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం విశేషం.


Also Read: Breaking: ఆ దేశ పార్లమెంట్​లో భారీ అగ్ని ప్రమాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook