venezuela maria corina Machado wins nobel peace award: గత కొన్ని నెలలుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనకే నోబెల్ శాంతిబహుమతి ఇవ్వాలని మంకుపట్టుపట్టారు. ఎనిమిది యుద్దాల్ని ఆపానని, ఇటీవల హమాస్, ఇజ్రాయేల్ ల మధ్య కూడా తన వల్లే యుద్దం ఆగిందని తెల్చి చెప్పారు.
పలు సమావేశాల్లో, బహిరంగ మీటింగ్ లలో కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఇంకేవరు తనలా ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాటుపడలేదని మొండివాదనకు దిగారు. తాజాగా.. రష్యా సైతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును నామినేట్ చేసింది.
ఈ క్రమంలో తాజాగా.. నోబెల్ జ్యూరీ మాత్రం సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోకు ఇస్తు ప్రకటన చేసింది. ఈ నార్వేజీయన్ అకాడమి మారియాను నోబెల్ శాంతి బహుమతి వరించిందని తెలిపింది.
ప్రజల హక్కుల కోసం మరియా కొరినా ఎంతగానో పాటుపడ్డారని నార్వే నోబేల్ కమిటి వెల్లడించింది. మరోవైపు.. హిరోసిమా, నాగసాకీల్లో అణుదాడి నుంచి బైటపడిన బాధితుల తరపున పోరాడిన జపాన్ కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు గతేడాది నోబేల్ శాంతి పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రంప్ ఆశలు ఆవిరి కావడంతో ఆయన దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో అసలు ఆయనకు నిద్ర ఉంటుందొ లేదో.. అంటూ నెటిజన్లు ఆయన్ను ట్రోల్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









