India vs Pakistan: భారత్ ఈ పని చేస్తే పాకిస్తాన్ లో మిగిలేది బొద్దింకలే.. ఉగ్రవాదుల కంటే అవే బెస్ట్ లే! కానీ ఇది ఎలా సాధ్యమంటే?

Pahalgam Terror Tttack: భారత్ పాకిస్తాన్ మధ్య  ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులతో కొనసాగించిన మారణ హోమం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని  భారతీయులు కోరుకుంటున్నారు. మరోవైపు సైన్యం కూడా ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో  సమర సన్నాహాలు ప్రారంభించింది.

Written by - Bhoomi | Last Updated : Apr 30, 2025, 10:50 PM IST
India vs Pakistan: భారత్ ఈ పని చేస్తే పాకిస్తాన్ లో మిగిలేది బొద్దింకలే.. ఉగ్రవాదుల కంటే అవే బెస్ట్ లే! కానీ ఇది ఎలా సాధ్యమంటే?

Pahalgam Terror Tttack: భారత్ పాకిస్తాన్ మధ్య  ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులతో కొనసాగించిన మారణ హోమం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని  భారతీయులు కోరుకుంటున్నారు. మరోవైపు సైన్యం కూడా ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో  సమర సన్నాహాలు ప్రారంభించింది. అయితే యుద్ధమంటూ మొదలైతే అది ఎటువైపు వెళుతుందో చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ క్షిపణులు కలిగి ఉన్న దేశాలు. ఈ నేపథ్యంలో  అణు యుద్ధం జరిగితే 15 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని  ఒక అధ్యయనం చెబుతోంది. అంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అయితే దేశమంతా తుడిచిపెట్టుకుపోయిన కేవలం ఒక జీవి మాత్రం బతికి పోతుంది అని చెబుతున్నారు. అదే కాక్రోచ్ లేదా బొద్దింక.

Add Zee News as a Preferred Source

ప్రపంచంలో 4,000కు పైగా  బొద్దింక జాతులు ఉన్నాయి, అందులో కేవలం 30 మాత్రమే మనుషుల వద్ద ఉంటాయి. వీటిని చూడటానికి ఎంతో అసహ్యంగాను మురికి ప్రదేశాల్లోనూ నివసిస్తుంటాయి. బొద్దింకలు ఉన్నాయి అంటే ఆ ప్రదేశం అపరిశుభ్రంగా ఉంది అని అర్థం. ఇవి ఆహార పదార్థాల పైన ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆవాహార పదార్థాల పైన పాకితే ఆహారం అపరిశుభ్రం అవుతుంది. బొద్దింకల కాళ్లలో టిబి, టైఫాయిడ్ వంటి వ్యాధికారక బాక్టీరియాలు ఉంటాయి.

 బొద్దింక చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఇవి 300 మిలియన్ల సంవత్సరాలుగా భూమిపై ఉన్నాయి. మనిషితో పోల్చి చూసినట్లయితే ఇవి మానవుల కంటే 100 రెట్లు ముందు నుంచి బతికాయి. డైనోసార్లు సైతం అంతరించిపోయిన, మధ్యలో వేరే జీవజాతులు సైతం అంతరించిపోయిన బొద్దింక మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. దీనికి ప్రత్యేక కారణం బొద్దింక‌లు తల లేకపోయినా కొన్ని వారాలు బతికే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే బొద్దింక జాతి అనేది తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇది కొద్దిపాటి ఆహారం తీసుకున్న 6 వారాల పాటు  ఏమీ తినకుండా జీవించగలుగుతాయి.

Also Read: Success Story: ఆయన పేరే ఒక బ్రాండ్.. 115 ఏళ్ల క్రితం పునాది పడి.. రూ. 70,000 కోట్లకు పడగెత్తిన టీవీఎస్.. సక్సెస్ స్టోరీ ఇదే  

వీటి శరీరంలో 13 గుండె ఛాంబర్లు ఉంటాయి, 45 నిమిషాలపాటు ఆక్సిజన్ లేకపోయినా బ్రతికే సామర్థ్యం  బొద్దింకలకు ఉంది. కొన్ని  బొద్దింక‌లు మౌంట్ ఎవరెస్ట్  వంటి ప్రతికూల ప్రదేశాల్లో కూడా  కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు.1945లో హిరోషిమా బాంబ్ పేలుడు తర్వాత కూడా  అక్కడ బొద్దింకలు చనిపోకుండా బతికినట్లు గుర్తించారు. ఆటంబాంబు పేలిన తర్వాత వెలువడిన అధిక రేడియేషన్‌లో ఇవి కూడా చనిపోతాయని  అంతా భావించారు కానీ  అవి బతికినట్లు మిత్‌బస్టర్ రీసెర్చ్‌ చూపింది.

బొద్దింక‌లు బైండింగ్ గ్లూ, సబ్బు, కాగితాలు, వెంట్రుకలు, మలమూత్రం, చెత్తాచెదారం వంటివి కూడా తింటాయి. తినేందుకు ఏదీ దొరకకపోయినా శరీర ఉష్ణోగ్రత తగ్గించుకుని  ఇది ఎక్కువ కాలం జీవించగలవు.  అమెరికాలో కొన్ని బొద్దింకలు  మద్యం కూడా సేవిస్తాయి.  ఇక బొద్దింక వేగం విషయానికి వచ్చినట్లయితే. ఇవి 200 మైళ్ల వేగంతో పరుగెత్తగలవు. చిన్న రంధ్రాల నుంచీ లోపలికి చొచ్చుకుపోతాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News