Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టెస్లా స్టాక్ విలువ పెరగడంతో ఎలాన్ మస్క్ సంపద 82 శాతం వృద్ధి చెంది 420 బిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 35 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఐదేళ్లలో ఎలాన్ మస్క్ నాలుగోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధిపతిగా ఉన్న 53 ఏళ్ల మస్క్ నికర విలువ 82% పెరిగి మొత్తం సంపద 420 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒక నివేదికలో పేర్కొంది. టెస్లా షేర్ ధర పెరగడం వల్లనే ఇది సాధ్యమైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికా బిలియనీర్ల సంపద పెరగడంలో ఆశ్చర్యమేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ హయాంలో మార్కెట్ పుంజుకోవడంతో మస్క్ సంపద భారీగా పెరిగింది. దీని ద్వారా చాలామంది అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు లాభపడ్డారు. వీరిలో పీటర్ థీల్ వంటి సహచరులు కూడా ఉన్నారు. థీల్ ఆర్థిక హోల్డింగ్స్ 67% పెరిగి 14 బిలియన్ డాలర్లకు చేరగా, మస్క్ 400 బిలియన్ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపదను కలిగి ఉన్న వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు.
ట్రంప్ ఎన్నికల విజయంతో పెట్టుబడిదారుల నమ్మకం పెరగడంతో టెస్లా షేర్ విలువ పెరిగిందని హురూన్ నివేదిక పేర్కొంది. ఇటీవల ఎలాన్ మస్క్ సంపదలో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. 2025 జనవరి 15, తర్వాత అతని నికర విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గింది. టెస్లా మార్కెట్ విలువ 700 బిలియన్ డాలర్లు తగ్గడంతో ఈ నష్టం వాటిల్లింది. చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి పెరుగుతున్న పోటీ, మస్క్ రాజకీయ ప్రకటనలపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. అయినప్పటికీ, మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ఇటీవల కాలంలో ఇతర అమెరికన్ బిలియనీర్లు కూడా భారీగా సంపదను కూడగట్టుకున్నారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఒక్కొక్కరు 80 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









