
Operation Sindhu: ఇరాన్, ఇజ్రాయిల్ వార్ సందర్భంగా ఇరాన్ లోని చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులను తమ దేశానికి తీసుకొచ్చిందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కు భారత్.. ఆపరేషన్ సింధూ పేరు పెట్టారు. రీసెంట్ గా పాకిస్థాన్ పై దాడులకు మన దేశం ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి పాక్ తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన సంగతి తెలిసిందే కదా. మన దేశ మహిళల నుదుటిన సింధూరాన్ని తుడిచేసిన ముష్కరులకు వాళ్లభాషలోనే భారత్ సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ ఆపరేషన్ సిందూర్ పై ప్రపంచం మొత్తం నివ్వెర పోయింది.
తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ వార్ నేపథ్యంలో ఇపుడు ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి రప్పించే కార్యక్రమానికి ‘ఆపరేషన్ సింధూ’ పేరు పెట్టడం గమనార్హం. యుద్దం చేస్తోన్న ఇరాన్, ఇజ్రాయిల్ తో మనకు మంచి దౌత్య సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో చిక్కుకుపోయిన వాళ్లను పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ గగన తలం నుంచి తరలించడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. దీంతో ఇరాన్ లో చిక్కుకున్న వాళ్లను ముందుగా అర్మేనియాకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి దోహాకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి మన దేశానికి విద్యార్ధులను ఎయిర్ లిఫ్ట్ చేశారు.
ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో రణరంగంగా మారింది. అక్కడి భారతీయ విద్యార్థులు తమ తరలింపునకు భారత ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. ఈ విషయమై జమ్మూ కశ్మీర్లో భారీ నిరసనలు కూడా జరిగాయి. ఇరాన్లో 13 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారని, వీరిలో అధికశాతం వైద్య విద్య చదువుతున్నారు. భారతీయ విద్యార్థులను సకాలంలో తరలించినందుకు జమ్ముకశ్మీర్ విద్యార్థుల సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
విద్యార్థుల కోసం ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే విమానంతో సహా అన్ని విమాన టిక్కెట్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిందని విద్యార్థుల సంఘం ‘ఎక్స్’లో తెలిపింది. ఇరాన్లో భారతీయ విద్యార్థులతో పాటు, పలువురు పర్యాటకులు కూడా చిక్కుకుపోయారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసి, అక్కడి భారతీయులను వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని కోరింది. ముందుగా టెహ్రాన్ నుంచి అర్మేనియా వయా దోహా నుంచి న్యూ ఢిల్లీ కి విద్యార్ధులను చేర్చారు. అప్పట్లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ గంగా నిర్వహించిన సమయంలో భారత వాయుసేనకు చెందిన 14 విమానాలతోపాటు మొత్తం 90 విమానాలను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు నడిపి అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook