India Pak War: బ్లాక్ అవుట్ తర్వాత కశ్మీర్ లోయ ప్రశాంతంగా ఉంది. యురి, కర్నా ప్రాంతంలో భయాందోళనలతో జనం ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. శ్రీనగర్, ఇతర జిల్లాల్లో తెల్లవారు జామున ఒంటిగంటకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. కుప్వారా, బారాముల్లా, బందిపోరా జిల్లాల్లోని నియంత్రణ రేఖ వద్ద రాత్రి భారీగా షెల్లింగ్ కొనసాగింది. యురిలో పాకిస్తాన్ షెల్లింగ్‌లో ఒక మహిళ మరణించగా 8మంది గాయపడ్డారని సమాచారం. శ్రీనగర్, లేహ్, జమ్మూ విమానాశ్రయాలు అన్ని పౌర విమానయాన కార్యకలాపాలను మూసివేశారు. విశ్వవిద్యాలయ పరీక్షలు రద్దు చేశారు. కశ్మీర్‌లోని అన్ని విద్యాసంస్థలు మూసిశారు. అధికారులు సోషల్ మీడియాతో పాటు సాధారణ మీడియాను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్లు లేదా నకిలీ వార్తలు, జాతీయ వ్యతిరేక కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. హై స్పీడ్ 5G ఇంటర్నెట్ సేవలు, అన్ని ఇతర టెలికమ్యూనికేషన్ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తున్నాయి.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిహద్దు జిల్లాలపై పాక్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఇవాళ ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసింది.
అటు జమ్మూలోనూ ఉదయం సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాక్ అవుట్ చేశారు. సరిహద్దు జిల్లాల్లో పాక్ నుంచి వస్తోన్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్‌ఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌ను పంపగా.. భద్రతా బలగాలు కూల్చేశాయి.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









