Pahalgam Attack: సింధులో భారతీయుల రక్తం పారిస్తాం.. ! భారత్ పై బిలావల్ భుట్టో పిచ్చి వాగుడు..

Pahalgam Attack: పహల్గామ్‌ ఘటనపై భారత్‌ తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్‌ విలవిల్లాడుతోంది.దీంతో అక్కడి నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన బిలావల్ భుట్లో భారత్ ప్రజలను ఉద్దేశించి పిచ్చి వాగుడు వాగాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 26, 2025, 10:30 AM IST
Pahalgam Attack: సింధులో భారతీయుల రక్తం పారిస్తాం.. ! భారత్ పై బిలావల్ భుట్టో పిచ్చి వాగుడు..

Pahalgam  Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక పౌరులను చంపి పాకిస్థాన్ తన గోతిలో తానే పడ్డట్టు అయింది. పాకిస్థానీ ఉగ్రవాదులు.. సైన్యంతో పాటు ఇతర భద్రతా అధికారులను టార్గెట్ చేయలేక సామాన్య పౌరులను ఈ సారి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.  ఈ పహల్గామ్ ఉగ్ర దాడిలో సహకరించిన స్థానిక గైడ్స్ తో పాటు ఇతరత్రా అక్కడి స్థానికులు కొంత మంది ఉగ్రవాదులకు సహకరించినట్టు సైన్యం తేల్చింది. ఇప్పటికే కొంత మంది ఇంటి దొంగలను గుర్తించి వారి అరెస్ట్ చేసి విచారిస్తోంది.

Add Zee News as a Preferred Source

ఇక పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న అతిముఖ్యమైన నిర్ణయం.. సింధునది జలాలను ఆపేయడం. సింధునది పై ఆధారపడే పాకిస్థాన్ లో 80 శాతం ప్రజలు బతుకుతున్నారు. వారి జీవనాడిని దెబ్బ కొట్టడం ద్వారా వారిని నిర్వీర్వం చేయాలనే నిర్ణయానికి భారత్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది నేతలు భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హఫీజ్ సయ్యద్ .. సింధునది జలాలను ఎలా ఆపుతారో చూద్దాం అంటూ బహిరంగ సవాల్ విసిరారు. అంతేకాదు మీరు నీళ్లు ఆపితే.. మీ శ్వాస ఆపుతాము అంటూ పిచ్చి వాగుడు వాగాడు.

అది హఫీజ్ సయ్యద్ మాటలను  మరిచిపోకముందే.. భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ధీటుగా పాకిస్థానీ పొలిటికల్ లీడర్లు దిగుతున్నారు. పాకిస్థాన్‌ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పహల్గామ్ దుర్ఘటనకు పాక్‌ను దోషిని చేస్తున్నారన్నారు.  వారి నిస్సహాయతను కప్పి పుచ్చుకోవడానికి మనల్ని నిందిస్తున్నారని ఆరోపించారు. అకారణంగా సింధు నదీ జలాలను నిలిపివేశారన్నారు.  సింధూ నది పాకిస్థాన్‌కు చెందినదని పేర్కొన్నారు. అందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఆ నదిలో నీళ్లు పారాలి లేదంటే వారి నెత్తురు పారుతుందని సుక్కూర్ సభలో భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News