Pakistan Officer Throat slit gesture at Video: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లండన్ లోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఇండియన్స్ ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ప్లకార్డులు ,జెండా పట్టుకుని అక్కడ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనల్లో భారతీయులతో పాటు యూదులు కూడా పాల్గొన్నారు. అయితే లండన్ పాకిస్తాన్ హై కమిషన్ ఎదుట భారతీయులు చేస్తున్న ఈ నిరసన సమయంలో పాక్ ఆర్మీ అధికారి తైముర్ రహమత్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. మీ గొంతు కోస్తా అంటూ సంజ్ఞలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అధికారిలా బహిరంగంగా రెచ్చిపోవడమేంటి అని భారతీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అవునులే టెర్రరిజం అనేది పాకిస్తాన్ డీఎన్‌ఏలోనే ఉందని ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ బుట్లో కూడా తీవ్రస్థాయిలో రెచ్చగొట్టు వాక్యాలకు దిగాడు. పహల్గాం దుర్ఘటనకు పాకిస్తాన్‌ను దోషిని చేయడం తప్పు అని వారి నిస్సాయహతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా నిందిస్తున్నారు అంటూ భారత్‌పై మండిపడ్డారు. అకారణంగా సింధు నది జలాలను నిలిపివేశారు. సింధునది పాకిస్తాన్ కి చెందింది. అందులో ఎలాంటి మార్పు ఉండదని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఒకవేళ ఆ సింధు నది నీళ్లు ఆపితే వారి నెత్తురు పారుతుందని భారత్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు.
ఇక భారత్ యుద్ధ సన్నద్ధత గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ పాకిస్తాన్ టీవీ ఛానల్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్‌కు చెందిన 25 మంది కలిసి కాశ్మీర్ అత్యాధునిక ఆయుధ సాంకేతికత పై భారత్ తో పని చేస్తోందని విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతోంది. ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా క్రియాశీలం చేసిందంటూ ప్రసారం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#BREAKING: Pakistan Army Defence Attache in London gestures towards Indian protestors to slit their throat publicly. This is Colonel Taimur Rahat of Pakistan Army, Air and Army Attache at Pakistan’s Mission in UK. No difference between a thug illiterate terrorist at this coward. pic.twitter.com/eZdRxqBN4q
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 25, 2025
ఇక నిన్నటి నుంచి పాకిస్తాన ఆర్మీ మాత్రం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అన్ని పోస్టుల వద్ద సైన్యం కాల్పులకు తెగబడుతుంది. నిన్న రాత్రి సమయంలో కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం పాకిస్తాన్ చర్యలకు ఇండియన్ ఆర్మీ కూడా దీటుగా జవాబు ఇస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇది ఉండగా పొరపాటున సరిహద్దు దాటిన బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహూను పాకిస్తాన్ బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.
ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..
ఇదీ చదవండి: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు హతం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది లైవ్ వీడియో విడుదల..
“میں آپ سب کو مبارک باد پیش کرتا ہوں کہ جس مقصد کیلئے پاکستان پیپلز پارٹی کے کارکن احتجاج کررہے تھے، شاہراہوں سے لے کر ایوان تک کہ ہمیں سندھو پر نئی نہریں منظور نہیں ہیں۔ کل وزیر اعظم سے ملاقات میں یہ بات طے ہوچکی کہ آپ کی مرضی کے بغیر کوئی نئی نہر نہیں بنے گی۔ یہ پرامن جمہوری… pic.twitter.com/I8sF0IFLXh
— PPP (@MediaCellPPP) April 25, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









