Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఖండిస్తూ అమెరికాలో ఎన్నారైల ర్యాలీ..

Pahalgam Terror Attack: ఈ నెల 22న జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26వ మందిని పొట్టనపెట్టుకున్నారు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఈ ఘటనను దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చనిపోయిన వారి కోసం దేశ వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అటు విదేశాల్లోని ఎన్నారై లను కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 28, 2025, 11:55 AM IST
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఖండిస్తూ అమెరికాలో ఎన్నారైల ర్యాలీ..

Pahalgam Terror Attack: పహల్గాం లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు కోల్పోయిన ప్రాణాలకు గౌరవం తెలియజేసేందుకు న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ఆదివారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు ఎన్నారైలు మౌ దీపం  కార్యక్రమం నిర్వహించబడింది.

Add Zee News as a Preferred Source

ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి వచ్చిన అనేక మంది ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. బాధితులకు శ్రద్ధాంజలి అర్పించారు. అంతేకాదు  మానవత్వం, శాంతి, ఐక్యత, సౌభ్రాతత్త్వం  వంటి విలువలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేసాు.  ప్రతి ప్రాణ నష్టాన్ని న్యాయం కోసం చేసే పిలుపుగా గుర్తించాలనే సందేశం ఇచ్చారు. అంతేకాదు భారత్ పై దాడికి తెగపడిన పాకిస్థాన్ కు దిమ్మ దిరిగే రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో  ఎన్నారైలు  ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలబడ్డారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, సామూహిక ప్రార్థనలతో బాధితుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ .. పాకిస్థాన్ పై లపు ఆంక్షలు విధించింది. ఇప్పటికే సింధు నది జలాలను పాక్ కు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దాంతో పాటు మన దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులు రెండు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఇకపై పాక్ తో ఉన్న అన్ని రకాల దౌత్య సంబంధాలను తెగ తెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. మరోవైపు పాకిస్థాన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు దేశం సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏ క్షణంలోనైనా పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News