Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్ర దుశ్చర్యపై మోదీకి ట్రంప్‌ ఫోన్‌.. భారత్‌కు మా సంపూర్ణ మద్ధతు ఉంటుందని హామీ..

Pahalgam Terror Attack Trump Reaction:    కాశ్మీర్ పహాల్గంలో మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది వరకు మరణించారు. వారిలో ఎక్కువ శాతం మంది పర్యాటకులు ఉన్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రముఖ తెగబడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దాడిని ఖండించారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 23, 2025, 07:07 AM IST
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్ర దుశ్చర్యపై మోదీకి ట్రంప్‌ ఫోన్‌.. భారత్‌కు మా సంపూర్ణ మద్ధతు ఉంటుందని హామీ..

 Pahalgam Terror Attack Trump Reaction: సౌదీ పర్యటనలో ఉన్న మోదీ అకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకొని ఈరోజు ఉదయం భారత్ చేరుకోనున్నారు. మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. మృతుల్లో ఎక్కువ శాతం టూరిస్టులు  కావడం ఆందోళనకు దారితీస్తుంది. ఇందులో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు ఉన్నారు..

Add Zee News as a Preferred Source

ఇక ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ కూడా నిర్వహించారు. డాగ్స్, డ్రోన్లు, హెలికాప్టర్లను కూడా ఉపయోగించారు. సీఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఆర్మీతో పాటు జమ్ము కాశ్మీర్ పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే జూలై 3న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ముందుగానే ఈ ఉగ్ర దాడి జరగడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పర్యాటకులు. కాశ్మీర్లో పర్యటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉగ్రదాడికి తెగబడ్డారు. 

 అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఉగ్ర దుశ్చర్యను ఖండించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేశారని జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదుశ్చర్యపై ఆరా తీశారు. అమాయక ప్రజలు మరణించడం పట్ల తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌తో కలిసి  పోరాడతామన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారని రణధీర్ ట్విట్ చేశారు. 

 

 

ఇదీ చదవండి:  ఎండిపోయిన నిమ్మకాయలను పారేయకండి.. ఈ 5 స్మార్ట్ ట్రిక్స్‌తో మళ్లీ వాడొచ్చు ..

అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ ఉగ్రదాడిపై స్పందించారు. చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు ఆయన రాసుకొచ్చారు. ఈ దాడిలో అమాయక ప్రజలు చనిపోవడం దారుణం అన్నారు.

 

అంతకు ముందే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ ఉగ్రదాడి తనను కలిసి వేసిందని ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నిఘా విభాగం అధికారి మనీష్ రంజాన్ సైతం చనిపోయారు. ఇది ఇలా ఉండగా కాశ్మీర్ టూర్ వెళ్లిన ఆరుగురు వైజాగ్ వాసులు కూడా మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాండురంగపురం వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విశాఖ పాండురంగపురానికి చెందిన మూడు కుటుంబాలు కాశ్మీర్ పర్యటనకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి తో పాటు మరో రెండు జంటలు మిస్ అయ్యాయి.

ఇదీ చదవండి:  రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

  

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News