)
Pakistan Airstrike: పాకిస్తాన్ లో జరిగిన వైమానిక దాడిలో 30 మంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని మాత్రే దారా గ్రామంలో పాకిస్తాన్ వైమానిక దళం తన సొంత భూభాగంలో వైమానిక దాడి జరిపి తీవ్ర ప్రాణనష్టం కలిగించింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో JF-17 ఫైటర్ జెట్లు LS-6 బాంబులు వేయడంతో దారా గ్రామంలోని అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో సుమారు 30 మంది మరణించారు. అందులో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు.మరో 20 మంది పైగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అనూహ్యంగా ఊచకోత ప్రారంభమైంది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామం మృతదేహాలతో నిండిపోయింది. దాదాపు 10 గంటల తర్వాత కూడా స్థానికులు, రెస్క్యూ బృందాలు శిథిలాల కింద మృతదేహాలను వెలికితీశాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారని తెలిపారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ సైన్యం ప్రజలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని పేర్కొంది. మత్తే దారా గ్రామం పూర్తిగా ధ్వంసమైందని.. అక్కడ ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయని తెలిపింది. మ్రుతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న శాంతి లోపాలను మరల చాటుతోంది. ఇక్కడ కొన్ని ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులు ఎక్కువ అధికారాన్ని, వనరులను కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ గ్రూపులను తరచుగా ఉగ్రవాదులుగా లేబుల్ చేస్తోంది. అయితే, ఈ సైనిక దాడి ద్వారా పౌరులపై తీవ్ర హింసను చూపించడం, ఊచకోత చేయడం వంటి ఆరోపణలు పాకిస్తాన్ సైన్యం నిరంతరం ఎదుర్కొంటోంది.
ఈ ఘటన ప్రపంచానికి పాకిస్తాన్ అంతర్గత సమస్యల తీవ్రతను మరోసారి చూపిస్తోంది. సైన్యం, ప్రభుత్వం మధ్య విభేదాలు, ప్రావిన్సుల ప్రజల అసంతృప్తి, పౌరుల భద్రతపై దాడులు పాకిస్తాన్ ప్రభుత్వ సామర్థ్యంపై ప్రశ్నలను లెవనెత్తుతున్నాయి. అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు ఈ దాడిని ఉద్దేశపూర్వక చర్యగా ఖండిస్తూ స్పందించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.