Pakistan Army Chief General: పాకిస్తాన్ అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతోంది. ఓ వైపు అప్ఘనిస్తాన్ తాలిబాన్లు ఓ వైపు పాక్ సైనికులు చుక్కులు చూపిస్తున్నారు. మరోవైపు బెలూచ్ రెబల్స్ పాకిస్తాన్ ఆర్మీ గుడ్డలూడదీసి ప్రపంచం ముందు ఉంచారు. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 1.3 మిలియన్ల సైన్యం ఉన్న భారత్, పాకిస్తాన్ ని బెదిరించలేకపోతుంది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు సాయుధ దళాలను అణచివేయగలరని అనుకుంటున్నారా, అంటూ భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీర్ సోదరులను మేం వదిలేయమని, వాళ్లకోసం నిరంతరం పోరాడుతూ ఉంటామని అసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ కి పెట్టుబడులు రాకపోవటానికి ఉగ్రవాద కార్యకలాపాలే కారణమన్నారు అసిమ్ మునీర్. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించలేరంటూ వ్యాఖ్యానించారు.
రాబోయే తరాలకు పాక్ చరిత్ర చెప్పాలన్నారు. హిందువులతో పోలీస్తే పాకిస్తానీలు భిన్నమన్నారు. మతం, సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు, ఆశయాలు భిన్నంగా ఉన్నందునే రెండు దేశాల సిద్దాంతాలు వేరువేరుగా ఉన్నాయన్నారు. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ఆక్రమణకు పాల్పడిన ఉగ్రవాదులు, పది తరాలు కష్టపడినా బలూచిస్తాన్ ని తీసుకోలేరని అన్నారు. సాయుధ దళాలతో ఉగ్రవాదులను అతి త్వరలోనే ఓడిస్తామన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎవరికి భయపడదని బలూచిస్తాన్ ఉగ్రవాదులకు అసిమ్ మునీర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.అయితే.. పాకిస్తాన్ లో ఇప్పటికే బెలూచ్ రెబల్ దెబ్బలకు పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ఎంతో మంది ఆర్మీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకోవడమే.. విదేశాలకు వెళ్లడమే చేస్తున్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









