Pakistan Bomb blast: పాకిస్థాన్ లో మరో ఆత్మాహుతి దాడి..

Pakistan Bomb blast: పాకిస్థాన్‌లోని బన్నూ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా..మరో 30 మంది గాయపడ్డారు. మరోవైపు పాక్‌ సైన్యం ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు అధికారులు తెలిపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 5, 2025, 01:30 PM IST
Pakistan Bomb blast: పాకిస్థాన్ లో మరో ఆత్మాహుతి దాడి..

Pakistan Bomb blast: నిరంతరం భారత్ పై విషం చిమ్మడమే  పనిగా మన దేశంపై ఉగ్రవాదులను పంపించి మనల్ని చిన్నాభిన్నం చేయాలనుకున్న పాకిస్థాన్ ఇపుడు అంతర్గతంగా సతమతమవుతోంది. ఓ వైపు బలూచ్ ఆర్మీ.. మరోవైపు అఫ్ఘానిస్థాన్ కు చెందిన తాలిబాన్లు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.  తాజాగా మంగళవారం సాయంత్రం పాకిస్థాన్ లో తీవ్రవాదులు రెచ్చిపోయారు.  పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్నూ కంటోన్మెంట్‌ గోడల్ని ఢీ కొట్టడం వల్ల పేలుడు సంభవించింది. ఘటనాస్థలి పెషావర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఖైబర్‌ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో ఉందని పోలీసులు తెలిపారు.

Add Zee News as a Preferred Source

పేలుడు తర్వాత గోడను బద్దలు కొట్టి చాలా మంది ఉగ్రవాదులు కంటోన్మెంట్‌ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారన్నారు. భద్రత దళాలు వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు. పేలుడు ధాటికి కంటోన్మెంట్‌కు సమీపంలో ఉన్న సాధారణ పౌర ఆవాస భవనాల్లో ఐదుగురు మరణించారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

మరో నాలుగు మృతదేహాలను కంటోన్మెంట్‌కు సమీపంలో ధ్వంసమైన మసీదు శిథిలాల నుంచి వెలికి తీశారు. మరోవైపు హాఫిజ్‌ గుల్‌ బహాదుర్‌ నాయకత్వంలోని జైష్‌ అల్‌ ఫుర్సాన్‌ తీవ్రవాద సంస్థ ఈ దాడికి తనదే బాధ్యత అని ప్రకటించింది. ఈ సంస్థ తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌-పాకిస్థాన్‌కు చెందిన అనేక చీలికవర్గాల్లో ఒకటి. ఈ దాడిని ఖైబర్‌ పఖ్తూంఖ్వా సీఎం అలీ అమీన్‌ గండాపుర్‌ ఖండించారు. రంజాన్‌ నెలలో ఈ ఘటన జరగడం అత్యంత విషాదకరమని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News