Pak Gold Mines: పాకిస్తాన్‌లో భారీగా పసిడి నిక్షేపాలు, ఆర్ధికంగా పటిష్టం కానుందా

Pak Gold Mines: ఉగ్రవాద ఆరోపణలు, ఆర్ధిక సంక్షోభం, పేరుకుపోయిన అప్పులతో దివాళా స్థితికి చేరుకున్న పాకిస్తాన్‌కు జాక్ పాట్ తగిలింది. ఒక్క దెబ్బతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితికి చేరుకునే అదృష్టం లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2025, 12:05 PM IST
Pak Gold Mines: పాకిస్తాన్‌లో భారీగా పసిడి నిక్షేపాలు, ఆర్ధికంగా పటిష్టం కానుందా

Pak Gold Mines: ఇండియా పొరుగు దేశం పాకిస్తాన్ ఇటీవలి కాలంలో ఆర్ధికంగా దారుణమైన స్థితికి చేరుకుంది. కరెన్సీ క్షీణించింది. ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్ధికంగా దివాళా పరిస్థితికి చేరిన పాకిస్తాన్ పూర్తిగా విదేశీ సహాయంపై ఆధారపడి నెట్టుకొస్తోందని చెప్పవచ్చు. కానీ రానున్న రోజుల్లో పాకిస్తాన్ భవిష్యత్ మారనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. 

Add Zee News as a Preferred Source

కేవలం వ్యవసాయంపై ఆధారపడిన పాకిస్తాన్ దశ మారనుంది. ఉగ్రవాదులకు తోడ్పాటు, పొరుగు దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో రాజకీయంగా ఇరుకునపడిన పాకిస్తాన్ ఆర్ధికంగా మరింత దిగజారిపోయింది. అందుకే ఈ దేశంలో రాజకీయ, ఆర్ధిక అస్థిరత ఉంటుంది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఆర్ధికంగా దివాళా తీసే స్థితికి చేరుకున్న పాకిస్తాన్ దశ త్వరలో మారనుంది. ఆ దేశానికి ఇప్పుడు జాక్‌పాట్ తగిలింది. ఇది మామూలు జాక్‌పాట్ కాదు. దేశాన్ని ఆర్ధికంగా పటిష్టమైన స్థితికి చేర్చనుంది. పాకిస్తాన్‌లో ఇప్పుడు పసిడి నిక్షేపాలు బయటపడ్డాయి. సింధూ నదిలో అపారమైన బంగారు నిల్వలు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ బంగారు నిల్వల విలువ ఏకంగా 80 వేల కోట్లు దాటి ఉంటుందని ప్రాధమిక అంచనా. 

పంజాబ్ ప్రావిన్స్‌లోని అల్టోక్ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు తెలిసింది. అప్పుడే వీటిని వెలికితీసే ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్‌లోని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పాకిస్తాన్, పంజాబ్ మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో పసిడి నిక్షేపాలు వెలికి తీయనున్నారు. అల్టోక్ జిల్లాలోని సింధూ నది వెంబడి 9 ప్లేసర్ గోల్డ్ బ్లాక్స్ కోసం వివిధ కంపెనీలు బిడ్డింగ్ ప్రయత్నాలు ప్రారంభించాయి. సింధూ నది వెంబడి హిమాలయాల వరకు బంగారు నిక్షేపాలు కలిగి ఉన్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు గతంలో స్పష్టం చేశారు. బంగారు నిక్షేపాలు పేరుకుపోవడం వల్ల నదీ ప్రవాహంతో పాటు ప్రవహించవచ్చు. ఇవి ఆకారంలో చదునుగా లేదా గుండ్రంగా ఉండవచ్చని అంచనా. 

పాకిస్తాన్‌లో 2024 డిసెంబర్ నాటికి 5.43 బిలియన్ డాలర్ల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు దొరికిన పసిడి నిక్షేపాలతో పాకిస్తాన్ ఆర్ధికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Also read: Ind vs Aus Semifinal: ఆసీస్‌తో సెమీస్ సమరానికి సిద్ధం, దుబాయ్ పిచ్ రిపోర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News