)
ied explosion cricket ground: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బజౌర్ జిల్లాలోని ఖర్ తెహసిల్‌లోని కౌసర్ క్రికెట్ మైదానంలో ఈ పేలుడు సంభవించింది. మీడియా నివేదికల ప్రకారం, బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫిక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ద్వారా పేలుడు జరిగిందని ధృవీకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పేలుడులో ఒకరు మరణించగా, పిల్లలతో సహా చాలా మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. ఈ పేలుడులో ఒకరు మరణించగా, పిల్లలతో సహా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, పేలుడు జరిగిన వెంటనే, మైదానంలో గందరగోళం నెలకొంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తారు. స్థానిక ఆటగాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఈ పేలుడు జరిగిందని పేర్కొంది. నివేదిక ప్రకారం ఈ సమయంలో దాడి చేసిన తర్వాత దుండగడలు ఒక పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారి దాడి విఫలమైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ దాడికి ఏ సంస్థ బాధ్యత వహించలేదు. ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. అయితే చాలా మందికి తీవ్రగాయాలయ్యాయని..మ్రుతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా ఈ ఏడాది జూన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్లోని ఖడ్డీ ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చేయడంతో 13 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని పాకిస్తాన్ సైన్యం మైన్-రెసిస్టెంట్ వాహనంలోకి దూసుకెళ్లి 13 మంది సైనికులను చంపాడు. తరువాత ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద సంస్థ అస్వాద్-ఉల్-హర్బ్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది.
BREAKING?:
One person killed and several others injured in an explosion while a cricket match was being played in Pakistan’s northwestern Khyber Pakhtunkhwa province.
pic.twitter.com/jWNXZ5mcT2— IndiaWarZone (@IndiaWarZone) September 6, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook