Pakistan Protests Israel - Gaza Deal: ఇజ్రాయిల్, పాలస్తీనాలోని గాజాలు శాంతి ఒప్పందం చేసుకొని వారి వద్దన్న బందీలను విడిపించుకునే పనిలో పడ్డారు. ఈ రెండు దేశాలకు లేని నొప్పి.. పాకిస్తాన్ కు వచ్చినట్టు ఉంది. గాజా, ఇజ్రాయిల్ తో శాంతి ఒప్పందం చేసుకోవడంపై పాకిస్తాన్ లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజా గాజా పరిస్థితులు, ట్రంప్ శాంతి ఒంప్పందాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు జరుగుతున్నాయి. పాక్ పాలకులు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గతవారం మొదలైన ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో ఒక అధికారి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లో ప్రధాన నగరమైన లాహోర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. నగరం మంటల్లో మండిపోతోంది. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గాజా యద్ధం ముగింపుపై పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తుంటే.. పాక్ హింసాత్మకంగా మారుతోంది.
పాలస్తీనా ప్రజలకు మద్దతుగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ లాహోర్, ఇతర ప్రాంతాల్లో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. నిన్న నిరసనకారులు.. లాహోర్ లోని పెద్ద మార్కెట్ ను బంద్ చేసారు. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ ముట్టడికి ప్లాన్ చేసింది . వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి. దాంతో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారు. తమ మద్దతుదారులు అనేకమంది మరణించారని, గాయపడ్డారని టీఎల్‌పీ చెప్తోంది.
పోలీసులు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో టీఎల్‌పీ చీఫ్ సాద్ రిజ్వీ గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులకు ముందు ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులను కోరినట్లు కనిపిస్తోంది. చర్చలకు తాము సిద్ధమని అభ్యర్థించారు. ఈ వీడియోలో తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించింది. మరొక వీడియోలో.. పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టారు. వాటిని తొలగించడంతో తాజాగా మరోమారు ఘర్షణలు చెలరేగాయి .
టీఎల్‌పీ ప్రదర్శనలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగుస్తోన్న సమయంలో ఈ పార్టీ నిరసనకు దిగడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో వేడుకలు చేసుకోవాల్సిందిపోయి, హింసకు దిగడమేంటో అర్థం కావడం లేదని పాక్ మంత్రి తలాల్ చౌధరీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇక నిరసన ప్రారంభం కావడానికే ముందు రోడ్లను దిగ్బంధించి ప్రభుత్వం అతిగా స్పందించిందని కొందరు విమర్శించారు.
Read more: గోవా నుంచి మన రాష్ట్రానికి ఎంత మద్యం తీసుకురావచ్చో తెలుసా..! చట్టం ఏం చెబుతోందంటే..
Read more: మన దేశంలో అత్యంత సంపన్న మంత్రులు వీళ్లే.. లిస్టులో తెలుగు వాళ్లే టాప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









