Suicide blast in Pakistan masjid video: దేశంలో పవిత్ర రంజాన్ మాసం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన షాపులన్ని రంజాన్ శోభతో కలకలలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పాక్ లోని అఖోరా ఖట్టక్‌లోని దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు శుక్రవారం నేపథ్యంలో భారీగా నమాజ్ చేసేందుకు మసీదుకు తరలి వచ్చారు.
ఈ క్రమంలో మసీదులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లుసమాచారం. అదేవిధంగా అనేక మంది గాయపడ్డారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని వార్తలు వస్తున్నాయి.
#Pakistan : Suicide blast during Friday prayers at Darul Uloom Haqqania, Akora Khattak. JUI-S chief Maulana Hamid-ul-Haq among the injured. Over 10 casualties reported. This madrassa is significant as it has produced top Taliban leaders, including Mullah Omar and Sirajuddin… pic.twitter.com/sc0Mfe524g
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) February 28, 2025
ఈ దాడిలో జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జెయుఐ-ఎస్) చీఫ్ మౌలానా హమీద్-ఉల్-హక్ కూడా మరణించారు. ముఖ్యంగా.. హమీద్-ఉల్-హక్‌ను చంపడానికే ఈ పేలుడు జరిగిందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మసీదు అంతా రక్తసిక్తంగా మారిపోయింది.
పేలుడు సంభవించగానే.. నమాజ్ చేస్తున్న వారు భయంతో పరుగులు పెట్టారు. కాస్తంతా తొక్కిసలాట కూడా సంభవించింది. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులు మసీదుకు చేరుకున్నారు. ఘటన స్థలంలో చనిపోయిన వారిని మార్చూరీకి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
Read more: Viral Video: హల్దీ వేడుకల్లో కోతి హల్ చల్.. ఏకంగా వధువు దగ్గరకు వెళ్లి మరీ ఆ పని.. వీడియో వైరల్..
మసీదు చుట్టుపక్కల భారీగా అంబులెన్స్ లు చేరుకున్నాయి. ఈ పేలుడు జరిగిన ప్రదేశంకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









