Pakistan train hijack: పాకిస్థాన్ పాపం పండింది. ఇన్నాళ్లు మన దేశంపై ఉగ్రవాదులను పంపిస్తూ పైశాచిక ఆనందం పొందిన పాకిస్థాన్ కు ఇపుడు అదే దేశంలోని బలూచిస్తాన్ స్వాతంత్య్ర పోరాట యోధులు.. పాకిస్థాన్ లో ఓ రైలును హైజాక్ చేయడం సంచలనం రేపుతోంది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే, ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికార సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారని తెలుస్తోంది. ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కువమంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులున్నారు. విషయం తెలిసిన వెంటనే పాకిస్థాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని, 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయని సమాచారం. 80 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడాయి. సహాయక , రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బలూచ్ రెబల్స్ .. మహిళలను వృద్దులను విడిచి పెట్టింది.
ముఖ్యంగా సమస్యాత్మక బలూచిస్థాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీస్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవరు సహా పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ దాడి తమ పనే అని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ - బీఎల్‌ఏ సోషల్ మీడియా వేదికగా ద్వారా ప్రకటించింది. ప్రభుత్వం తమపై ఏదైనా మిలటరీ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తే.. భద్రతాదళాలు వెనక్కు తగ్గకపోతే అందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మహిళలు, చిన్నారులను విడిచిపెట్టినట్లు బీఎల్‌ఏ చెబుతున్నప్పటికీ.. వారిని రక్షణ కవచాలుగా వాడుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ కోసం మరో రైలును అక్కడకు పంపించామని వివరించాయి.
పాక్‌లోని బలోచిస్థాన్‌కు ఇరాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దులు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా - పాకిస్థాన్ ఆర్థిక నడవా సీపెక్ బలోచిస్థాన్ మీదుగా వెళ్తుండటం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా.. తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదో ప్లాన్ అని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
పాకిస్థాన్‌లోని దాదాపు 44 శాతం భూభాగం బలోచిస్థాన్ ప్రావిన్సులో ఉంది. ఇక్కడ పాక్ లో ఎక్కడా లేనట్టు చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం తాండవిస్తోంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్‌లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది.
నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి ఇప్పటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’. తమ ప్రాంతానికి చెందిన సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్‌తోపాటు అమెరికా, బ్రిటన్ బీఎల్‌ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









