Pakistan train hijack: ప్రపంచం ముందు పాక్ గుడ్డలూడదీసిన బలూచ్ రెబల్స్..

Pakistan train hijack: ఒకప్పుడు మన దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ భారత వినాశనాన్ని కోరుకున్న పాకిస్థాన్ కు ఇపుడు బ్యాడ్ టైమ్ నడుస్తుందనుకుంటా. తాజాగా పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైలు హైజాక్ ఇష్యూలో తాము పై బలూచ్ రెబల్స్ పై పై చేయి సాధించామని చెప్పుకున్న పాకి ఆర్మీ నేతల మాటలు నీటీ మూటలే అన్నది తేలిపోయింది. అంతేకాదు ప్రపంచ ముందు పాకిస్థాన్ బట్టలూడదీసి అందరి ముందు నిలబెట్టింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 16, 2025, 12:55 PM IST
Pakistan train hijack: ప్రపంచం ముందు పాక్ గుడ్డలూడదీసిన బలూచ్ రెబల్స్..

Pakistan train hijack: పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైల్ హైజాక్ దునియా మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక బలూచిస్థాన్ దేశం కావాలనుకుంటున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్థాన్ నుంచి  ఖైబర్ పఖ్తుంఖ్వాలోని  పెషావర్ కు వెళుతున్న రైలును హైజాక్ చేశారు. ఈ రూట్లో దాదాపు 17 పెద్ద సొరంగ మార్గాలున్నాయి. అందులో 8వ సొరంగం వద్ద ట్రాక్స్ ను పేల్చి జాఫర్ ఎక్స్ ప్రెస్ ను తమ గుప్పెట పెట్టుకున్నారు. . అయితే.. ఇప్పటి వరకు మనం విమానం హైజాక్ తో పాటు..  ప్రపంచంలో డెన్మార్క్ తర్వాత  ఓ రైలును హైజాక్ చేసిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. తాజాగా జరిగిన ఈ ఘటనలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ 240 మంది పాక్ ఆర్మీ సైనికులను ఊచకోత కోసంది. ముందుగా 100 మంది తమ వద్ద బందీలుగా ఉన్నారని ప్రకటించింది BLA. తాజాగా 240 మందిని పాకిస్థాన్ కు చెందిన ఆర్మీ వాల్లను మట్టు పెట్టింది.

Add Zee News as a Preferred Source

అయితే.. పాకిస్థాన్ ఆర్మీ మాత్రం..బలూచ్ రెబల్స్ పై తమ సైన్యం పై చేయి సాధించిందని చెప్పుకున్నా.. వాస్తవంగా భిన్నంగా ఉంది. అదే విషయాన్ని బలూచ్ ఆర్మీ ప్రపంచ ముందు ఉంచింది అనే కన్నా.. పాకిస్థాన్ బట్టలూడి ప్రపంచం ముందు పెట్టింది. అంతేకాదు బీఎల్ఏ ఫైటర్స్ .. పాక్ సైనికులు ఇంటరాగేషన్ చేస్తోన్న విజువల్స్ ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. మొత్తంగా తమ సైనిక అధికారులను కూడా రక్షించుకోలేని దుర్భర పరిస్థితుల్లో పాకిస్థాన్ దిగజారి పోయింది.

ముఖ్యంగా చైనా దేశం పాకిస్థాన్ మీదుగా తమ దేశంలోని షింజియాంగ్ నుంచి పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తూంఖ్వా , పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్ బాల్టిస్ఠాన్ తో పాటు పంజాబ్, సింధ్ మీదుగా.. బలూచిస్థాన్ లోని  గ్వాదర్ వరకు ఈ రోడ్డు ఉంది. తమ వనరులను దోచుకొని తమపై చైనా,పాకిస్థాన్ దాష్ఠీకాలకు పాల్పడుతుందనే ఉద్దేశ్యంతోనే బలూచ్ రెబల్స్ అక్కడ సీ పెక్ ( చైనా పాకిస్థాన్ ఎకానామిక్ క్యారిడార్) ను అడ్డుకుంది. అంతేకాదు అక్కడ పనిచేస్తోన్న చైనీయులను కొంత మందిని చంపేసింది.

చైనా ఇప్పటికే గ్వాదర్ పోర్టకు తమ ఆర్మీనే సెక్యూరిటీ గా పెట్టుకున్నది. ఇప్పుడు మరింత భద్రత పెంచుతుందా లేక గ్వాదర్ పోర్టుని ఖాళీ చేసి చెక్కేస్తుందా  అనేది చూడాలి. గెరిల్లా తరహా దాడులని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఆర్మీ కి ఉన్న అనుభవం చైనా PLA కి లేదు. BLA కనుక ఒక తీవ్రమైన దాడి చేస్తే చాలు చైనా తోక ముడవాల్సిందే. యుద్దాల్లో ఎంతో అనుభవం ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి సాధ్యం కానిది చైనా సైన్యానికి ఎలా సాధ్యం అవుతుందనేది చూడాలి. ఒకవేళ పీవోకే కనుక భారత ఆధీనంలోకి వస్తే.. భారత్ తో అగ్రిమెంట్ చేసుకొని ఈ సీపెక్ ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది చైనా. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం సరుకు రవాణే. ముఖ్యంగా చైనా నుంచి పీవోకే మీదుగా గ్వాదర్ పోర్టుకు అక్కడ నుంచి అరేబియా సముద్రం మీదుగా యూరప్, మిడిల్ ఈస్ట్ కు రవాణాల చేయాలనేదే చైనా ముఖ్య ఉద్దేశ్యం.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News