Pakistan train hijack: బలూచ్ ఆర్మీ లక్ష్యం అదేనా..! అందుకే ట్రైయిన్ హైజాక్ చేసారా..!

Pakistan train hijack: పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైల్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ నివ్వెర పరిచింది. ఇంతకీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. ఉద్దేశ్యం ఏమిటి..? ఎందుకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్ర దేశం కావాలనుకుంటున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2025, 03:34 PM IST
Pakistan train hijack: బలూచ్ ఆర్మీ లక్ష్యం అదేనా..! అందుకే ట్రైయిన్ హైజాక్ చేసారా..!

Pakistan train hijack: పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికులతో వెళుతున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై దాడికి దిగారు. దానిని హైజాక్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్థాన్ లో సంచలనం రేపుతోంది.ముఖ్యంగా ఎన్నో గుట్టలు, పర్వతాలు, ఎడారులతో ఎంతో  సమస్యాత్మకంగా ఉండే  బలూచిస్థాన్‌ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్ ప్రెస్  రైలును బలూచ్ రెబల్స్ హైజాక్ చేశారు. ఈ మార్గంలో దాదాపు 17 సొరంగాలున్నాయి. అందులో 8వ సొరంగం వద్ద ట్రాక్స్ ను పేల్చి జాఫర్ ఎక్స్ ప్రెస్ ను చేజిక్కించుకున్నారు. అయితే.. ఇప్పటి వరకు మనం విమానం హైజాక్ తో పాటు..  ప్రపంచంలో డెన్మార్క్ తర్వాత  ఓ రైలును హైజాక్ చేసిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది.

Add Zee News as a Preferred Source

తాజాగా బలూచ్ రెబల్స్ పట్టుకున్న రైలు పై మిలటరీ ఆపరేషన్ చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ని మట్టుపెట్టినట్టు పాకిస్థాన్ సైనిక అధికారులు చెబుతున్నారు. కానీ నిజంగా వారు రైలు హైజాక్ చేసిన ప్రాంతానికీ చేరుకోలేదనేది మరో కథనం. కేవలం అక్కడ ప్రజల్లో ఆర్మీపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటానికి ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

ఈ దాడి తమ పనే అని అక్కడ  వేర్పాటువాద మిలిటెంట్‌ గ్రూపు బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ - బీఎల్‌ఏ సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించింది. ‌ అయితే.. బలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఎన్నో వనరులున్నా రాష్ట్రం. మొత్తం భూ భాగంలో దాదాపు 45 శాతం ఉంటుంది.  ముందు నుంచి పాకిస్థాన్ లో కలవడానికి ఒప్పుకోలేదు. అప్పట్లో భారత్ లో కలుస్తామన్నా.. అప్పటి ప్రధాని మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో అయిష్టంగానే అప్పటి పాలకుడైన అహ్మద్ యార్ ఖాన్ పాక్ లో విలీనం అవుతున్నట్టు 1948 మార్చి 27న  ఒప్పందంపై సైన్ చేశారు.

 ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్టు చమురు, బంగారం, రాగి, బొగ్గు, సహజ వాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు పాకిస్థాన్ అప్పట్లో చేపట్టిన అణు పరీక్షలన్ని బలూచిస్తాన్ లోనే జరిపింది. అంతేకాదు పాకిస్థాన్ పాలకులు.. ఇక్కడ సహజ వనరులను దోచుకొని తమను పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక దేశం కోసం బలూచ్ ప్రజలు పోరాడుతున్నారు. కానీ ఆర్మీలో ఎక్కువగా ఉండే పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లోని అధికారులు.. ఇక్కడ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని చూసారు కానీ..అది నివురు గప్పిన నిప్పులా ఎగిసిపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2000లో ఏర్పడిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’. తమ ప్రాంతానికి చెందిన సహజ వనరులను తమకే చెందాలనే వాదనతో వీరు గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరోవైపు ఖైబర్ పంక్తున్వాలో కూడా పాక్ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. వీళ్లు గత కొన్నేళ్లుగా మిలిటెన్సీ బాట పట్టింది. అయితే.. బీఎల్ఏను పాకిస్థాన్ లతో పాటు బ్రిటన్, అమెరికాలు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. మొత్తంగా చూసుకుంటే... అప్పట్లో రెండు ముక్క చెక్కలైన పాకిస్థాన్ మరో నాలుగు చెక్కలు కావడం గ్యారంటీ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ఈ ట్రైయిన్ హైజాక్ తో బలూచ్ రెబల్ ఆర్మీ .. తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పడంలో సక్సెస్ అయ్యారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News