Balochistan: పాకిస్థాన్ లో బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం సాగుతోన్న ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ కొత్త చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరిపైనా అనుమానం ఉంటే చాలు, ఎవరినైనా అరెస్టు చేసే అవకాశం వుంటుంది. కోర్టు అనుమతి లేకుండానే 90 రోజుల వరకు నిర్బంధించవచ్చు. పోలీసులు, నిఘా సంస్థలు కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పడి సోదాలు చేయవచ్చు. ఆధారాలు సేకరించవచ్చు. అరెస్టు చేయడానికి కూడా వీలుంది.
కేవలం అనుమానం ఆధారంగా అరెస్టులు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ చట్టం వల్ల ప్రజలకు న్యాయపరమైన రక్షణ ఉండదని, గతంలో రహస్యంగా జరిగే పనులను ఇప్పుడు చట్టబద్ధం చేశారని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఉగ్రవాద వ్యతిరేక సవరణ చట్టం 2025 పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంపై స్థానికులు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం సైన్యానికి, నిఘా సంస్థలకు ఉంటుంది. ఈ చట్టం పౌరుల హక్కులను ఉల్లంఘిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలోచ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టం రూపొందించారని తెలుస్తోంది. అయితే ఇది పాకిస్థాన్ రాజ్యాంగానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. స్థానిక మానవ హక్కుల సంఘం హెచ్‌ఆర్‌సీపీతో పాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్, ఐసీసీపీఆర్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









