Fierce Clash Between Taliban And Pakistan: యుద్ధం మొదలైంది.. దాయాదీ దేశం పాకిస్తాన్‌తో ఆఫ్ఘనిస్తాన్ పోరాడుతోంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు మిన్నంటాయి. పాక్‌కు చెందిన పలు ఆర్మీ పోస్టులను తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకుందని ఆఫ్గాన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించినట్లు టోలో న్యూస్ తెలిపింది. ఇక కూనార్, హెల్మండ్ ప్రొవిన్స్ లో రెండు పాక్ పోస్టులను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇటీవల కాబూల్ పై పాక్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరాయి.
అక్టోబర్ 9వ తేదీ పాకిస్తాన్ జలాలబాద్ ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ చీఫ్ నూర్‌వలి మహమ్మద్ లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసింది. అక్టోబర్ 11 నంగరహర పునార్ ప్రోవిన్సులో పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడులు ప్రారంభించింది. ఇక పాకిస్తాన్‌కు చెందిన పలు పోస్టులపై ధ్వంసం చేస్తూ వచ్చింది. ఆఫ్గాన్ సరిహద్దు దళాలు, పాకిస్తాన్ దళాల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘర్షణలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారని మీడియా వెల్లడించింది.
ఆఫ్గాన్ సైనికులు ఇప్పటికే పాకిస్తాన్ సైనికుల ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి కాబుల్లో జరిగిన రెండు పేలుళ్ల తర్వాత తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానికు దాడులు కూడా చేసింది. పాకిస్తాన్ ఆఫ్గాన్ గగనతలాన్ని ఉల్లంఘించి డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాక్టికాలోని మార్కెట్ ప్రాంతంపై బాంబు దాడి కూడా చేసింది. ఇది రెచ్చగొట్టే చర్యగా ఆఫ్గాన్ తీవ్రంగా ఖండించింది.
منابع: پنج نظامی پاکستانی در آن سوی خط فرضی کشته شدند
منابع به طلوعنیوز تایید کردند که در نتیجه درگيری میان نیروهای امارت اسلامی افعانستان و پاکستان، تاکنون پنج نظامی پاکستانی کشته و دو نفر دیگر زخمی شدهاند.#طلوعنیوز pic.twitter.com/fujJ3Lmxi1
— TOLOnews (@TOLOnews) October 11, 2025
ఇదిలా ఉండగా తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఈ వైమానిక దాడులు నిర్వహించారు. దీనిపై ముత్తాఖీ మాట్లాడుతూ ఆఫ్గాన్ ధైర్యాన్ని పరీక్షించకూడదు ..భారత్ ,పాక్ రెండిటితోను మేము మంచి సంబంధాలు కోరుకుంటున్నాం. ఏకపక్షం ఉండదు అని కూడా ఆయన చెప్పుకోచ్చారు. ఇంతలోనే ఇలా ఆఫ్గానిస్థాన్ పాకిస్తాన్ మధ్య దాడులు జరగడం ప్రారంభమయ్యాయి.
Read more: నోబెల్ ప్రైజ్ రాకపోవడంతో ట్రంప్ ఏమన్నారో తెలుసా? వీడియో వైరల్..
Read more: ఆలస్యం చేస్తే అస్సలు ఊరుకునేది లేదు.. హమాస్‌కు అమెరికా అధ్యక్షుడి అల్టిమేటం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









