Pakistan Citizenship: ప్రస్తుతం అమెరికా సహా వివిధ అగ్ర దేశాలు తమ దేశ పౌరసత్వం కావాలనుకునే వివిధ దేశాలకు వాళ్లకు ఎంతో కొంత చెల్లిస్తే.. తమ సిటిజన్ షిప్ ను అందిస్తున్నాయి. ఈ కోవలో ఇపుడు పాకిస్థాన్ కూడా తమ దేశ పౌరసత్వం కావాలనుకునే వాళ్లకు ఓ బంపరాఫర్ ప్రకటించింది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కొన్ని డాలర్లు చెల్లిస్తే.. మా దేశ పౌరసత్వం ఇస్తామని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. అటు కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు కూడా తమ ప్రభుత్వానికి ఎవరైనా ఎంతో కొంతో చెల్లిస్తే.. వాళ్ల దేశ పౌరసత్వం ఇవ్వడమనేది ఎప్పటి నుంచో ఉంది. ఇలాగే మన దేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన కొంత మంది లండన్, కెనడా పౌరసత్వం తీసుకున్నారు. వీళ్ల తరహాలోనే ఎన్నో దేశాలు ఇలా వివిధ దేశాలకు చెందిన పౌరులకు సిటిజన్ షిప్ అందిస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ కూడా తమ పౌరసత్వం కావాలనుకునే వాళ్లకు ఓ బంపరాఫర్ ప్రకటించింది అక్కడ ప్రభుత్వం.
అమెరికాలో 50 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగలిగితే.. ఆ దేశ పౌరుడు కావొచ్చు. కెనడా కూడా ఇదే తరహాలో కొంత సొమ్ము తీసుకొని తమ దేశ పౌరసత్వం విదేశీలకు ఇస్తోంది. అక్షయ్ కుమార్ వంటి కొంత మంది నటులు అప్పట్లో కెనడా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సిటిజన్ షిప్ కాన్సిల్ చేసుకొని మళ్లీ భారతీయ పౌరసత్వం తీసుకున్నారు.
పులిని నక్క వాత పెట్టుకున్నట్టు.. పాకిస్తాన్ కూడా ఒక గోల్డెన్ వీసా తరహాలో ఓ గోల్డెన్ ఆఫర్ ప్రకటించింది. ఆ దేశ సిటిజన్ షిప్ కావాలంటే .. 67500 పాకిస్తాన్ రూపాయిలు ఉంటే సరిపోతుంది. అమెరికా కరెన్సీలో 18 వేల డాలర్లు కావాలట. మన దేశ కరెన్సీలో రూ. 14,70,000 ఇండియన్ కరెన్సీ లో అయితే సరిపోతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ అంతర్గత కలహాలతో సతమత మవుతోంది. అక్కడ బలూచ్ రెబల్స్ వాళ్ల దేశానికి చెందిన ఆర్మీతో పాటు ఐఎస్ఐ వాళ్లను ఊచకోత కోసింది. ప్రస్తుతం ఆ దేశంలో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. ఓ వైపు బలూచ్ రెబల్స్.. మరోవైపు ఖైబర్ పంక్తూన్వాలో తిరుగుబాటులతో సతమత మవుతోంది. మొత్తంగా నాలుగు ప్రావిన్స్ లో రెండు ప్రావిన్స్ ప్రజలు స్వాతంత్య్ర దేశం కావాలని పోరు బాట పట్టారు. మొత్తంగా చూసుకుంటే.. పాకిస్థాన్ త్వరలో సింధ్, పంజాబ్ పాకిస్థాన్, ఖైబర్ పంక్తూన్వా, బలూచిస్థాన్ గా విడిపోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా మన దేశంలో ఉంటూ పాకిస్థాన్ పాట పాడే వాళ్లు.. భారత్ ను ద్వేషించే వాళ్లు అక్కడికి వెళ్లి ఆ దేశ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో జాతీయ వాదులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ని ప్రేమించే వాళ్ళు.. పాకిస్తాన్ లో ఉన్నంతటి స్వేచ్ఛ మన దగ్గర లేదని మాట్లాడే వాళ్ళు.. అట్లాగే భారత్ లో మాకు అన్యాయం జరుగుతుంది అనేవాళ్ళు.. చక్కగా పాకిస్తాన్ లో పౌరసత్వం తీసుకోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









