
Passport Ranking List 2025: పాస్‌పోర్ట్ ప్రతి దేశానికి ఎంతో ముఖ్యం ఇతర దేశాలకు ప్రయాణం చేయాలన్నా, ఉద్యోగం, చదువుల పరంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాల్సిందే. అయితే వీసా విషయాన్ని పాస్‌పోర్ట్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. ఇది ఆ దేశం గుర్తింపు అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న పాస్‌పోర్టు ఏ దేశానికి చెందినది తెలుసా? అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ టాక్స్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నోమాడ్ క్యాపిటలిస్ట్ ఇటీవల విడుదల చేసింది ఈ ర్యాంకింగ్‌లో ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
అయితే మన భారతీయ పాస్‌పోర్ట్ స్థానం ఇందులో ఎక్కడ ఉందో తెలుసా? ఈసారి మరింత దారుణంగా పడిపోయింది. అదే విధంగా పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఎప్పటిలాగే అత్యంత బలమైన హీనమైన పాస్‌పోర్ట్ జాబితాలో ఉంది. నోమాడ్ క్యాపిటలిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్ జాబితా విడుదల చేసింది. అందులో వీసా రహిత ప్రయాణం, పన్ను విధానం, ప్రపంచ అవగాహన ద్వంద్వ పౌరసత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటివి పరిగణలోకి తీసుకుంది. 199 పాస్‌పోర్ట్ జారీ చేసే దేశాలు, భూభాగాల నుంచి ప్రభుత్వం డేటా. రియల్ టైం ఇంటెలిజెన్స్ పరిశోధనల ఆధారంగా తీసుకుంది.
దాని ఆధారంగానే 10 నుంచి 50 వరకు మార్కులు ఇస్తారు. 199 దేశాలను మూల్యాంకనం చేస్తే నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ ఆ స్థానాన్ని కోల్పోయింది. ఇక ఐర్లాండ్ 2025 ప్రపంచంలో అత్యంత బలమైన పాస్‌పోర్ట్ గా ఓటు వేశారు. అంటే ప్రధానంగా ఈయూ, యూకే అంతట స్వేచ్ఛగా జీవించే, పని చేసే హక్కును ఇది కల్పిస్తోంది. జాబితాలో ఐర్లాండ్ -1 స్విట్జర్లాండ్- 2, గ్రీస్ 3 -పోర్చుగల్- 4 మాల్టా- 5, ఇటలీ -5, ఫిన్లాండ్ -7, నార్వే-7 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-10, న్యూజిలాండ్ -10, ఐస్లాండ్ 10 స్థానంలో నిలిచాయి.
అయితే ఈ జాబితాలో మన భారతదేశ 148వ స్థానానికి దిగజారిపోయింది. గత సంవత్సరం ఇండెక్స్ లో భారత్ మోజంబిక్ తో పాటు 147 స్థానంలో ఉండేది. ఇప్పుడు కొమరోస్ తో పాటు 148 స్థానంలో ఉంది. అతి శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో భారతదేశం హేండ్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ లో మాత్రం 85వ స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో పాకిస్తాన్ పాస్‌పోర్ట్ తన స్థానాన్ని మళ్ళీ కోల్పయింది. అమెరికా 45వ స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్, ఎరిత్రియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. ఇవి 195 నుంచి 199 స్థానంలో నిలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe