Viral Video: అమ్మ బాబోయ్.. హైవే మీద వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో చూస్తే పక్కా షాకవుతారు..!

Plane hits car: హైవే మీద ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  

Written by - Aruna Maharaju | Last Updated : Dec 10, 2025, 11:55 AM IST
Viral Video: అమ్మ బాబోయ్.. హైవే మీద వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో చూస్తే పక్కా షాకవుతారు..!

Plane hits car in America: హైవే మీద ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలోని ప్లోరిడాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది.. కారులో ప్రయాణిస్తున్న మహిళకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి.  

Add Zee News as a Preferred Source

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం బీభత్సం సృష్టించింది. అక్కడి కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి బ్రెవర్ట్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ -95 హైవేపై వేగంగా వెళ్తున్న కారును విమానం వెనుక నుండి ఢీకొట్టింది. అయితే కారు వేగంగా వెళ్తుండగా.. విమానం గాల్లో నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చింది. ఆ తర్వాత నేరుగా కారును ఢీకొట్టింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు స్వల్ప గాయాలు కాగా.. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఇక ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ఓ ప్రయాణికుడు ఉన్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. వీరు సేఫ్‌గా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనలో విమానం డైరెక్ట్‌గా దూసుకొచ్చి కారును ఢీకొట్టిండి. ఆ తరువాత కారు, విమానం ఒక్కసారిగా.. విపరీతమైన సౌండ్ చేస్తూ పక్కకు దూసుకెళ్లాయి. దీంతో ఆ హైవే మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన కారు వెనుకాలే వస్తున్న మరో కారుకు అమర్చిన కెమెరాలో.. ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read: CM Chandrababu: ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read: Fire Accident: ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. గర్భిణి సహా 22 మంది సజీవ దహనం.. ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News