India - Pakistan: దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందన్నారు. శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన ప్రశంసించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందన్నారు. శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.మోడీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసని చెప్పారు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం తన బాధ్యత అని స్పష్టం చేశారు
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ భేటీ అయ్యారు. శనివారం నేవీ చీఫ్ మార్షల్‌తోనూ మోడీ భేటీ అయ్యారు. ఇప్పటికే భారత్ మాపై ఏ క్షణమైనా తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పాక్ భయంతో వణికిపోతుంది.
అయినప్పటికి కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరింపులకు దిగారు. బెదిరింపులను ఏ మాత్రం పట్టించుకోకుండా..భారత్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.
ఇంకోవైపు పంజాబ్ అమృత్‌సర్‌లో భద్రతా దళాలు పాక్ గూఢచారులను అరెస్ట్ చేశారు. భారత సైనిక దళాల కదలికలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం, ఫొటోలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులను పంజాబ్‌లోని అమృత్‌సర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్‌లుగా వీరిని గుర్తించారు. వీరు పాక్‌లోని ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు సమాచారం ప్రకారం హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పని చేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ అమృత్‌సర్ జైల్లో ఉన్నాడు. వీరి వద్ద అత్యంత సున్నితమైన విజువల్స్‌తోపాటు, డేటా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికార రహస్యాల చట్టం కింద వీరిపై కేసులు పెట్టారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని అరెస్టులు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









