
POJK:తమ స్వప్రయోజనాలను పాక్ సర్కార్ పణంగా పెడుతుందని ఆందోళన బాట పట్టారు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలు. వీరికి స్థానిక రాజకీయ పార్టీల మద్దతు తోడవ్వటంతో...ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. గుల్మార్ట్ నగర్ లో వేలాది మంది వ్యాపారులు, స్థానికులు రోడ్లపై నిరసనదిగారు.
జాతీయ రహదారిని 3 రోజులుగా దిగ్బంధించారు. దీంతో పాక్, చైనా మధ్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పీఎంఎల్ పార్టీకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు. మరోవైపు సీపెక్.. చైనా పాకిస్థాన్ ఆర్ధిక నడవా సంబంధించి అక్కడి స్థానికులకు కాకుండా చైనా వాళ్లతోనే అన్ని పనులు చేయిస్తున్నారు. అంతేకాదు వాళ్లు తమపై ఆధిపత్యం చేయడాన్ని సహించలేకపోతున్నారు. కేవలం పీవోజేకేలోనే కాకుండా.. బలూచిస్థాన్ లో కూడా చైనాకు సంబంధించిన అధికారులకు అక్కడి తిరుగుబాటు దళాలు చుక్కలు చూపిస్తున్నాయి.
మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దేశం పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వారిని చావు దెబ్బ తీసిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు పీవోజేకే ప్రజల్లో కొంత మంది ప్రజలు మాత్రం తమ భూభాగాన్ని ఉగ్రవాదానికి వాడుకుంటున్నారు. అంతేకాదు తమకు విద్యను దూరం చేస్తూ తమను తీవ్రవాదం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా పాకిస్థాన్ ఆక్రమిత ప్రజలు మాత్రం పక్కనే ఉన్న జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ది చూసి భారత్ లో విలీనం కావాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.