Justin Bieber Facial Paralysis: షాకింగ్... పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు ముఖ పక్షవాతం...

Justin Beiber Suffers from Facial Paralysis: పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. జస్టిన్ బీబర్ పక్షవాతం బారినపడ్డాడు. ఈ విషయాన్ని బీబర్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2022, 12:14 PM IST
  • పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు పక్షవాతం
  • ముఖ పక్షవాతంతో బాధపడుతున్న జస్టిన్ బీబర్
  • స్వయంగా వెల్లడించిన జస్టిన్ బీబర్
Justin Bieber Facial Paralysis: షాకింగ్... పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు ముఖ పక్షవాతం...

Justin Beiber Suffers from Facial Paralysis: చిన్న వయసులోనే పాప్ సింగర్‌గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న జస్టిన్ బీబర్‌ అనారోగ్యం బారినపడ్డాడు. బీబర్ ప్రస్తుతం ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాడు. పక్షవాతం కారణంగా తన ముఖంలోని కుడి వైపు భాగాన్ని కదిలించలేకపోతున్నాడు. కుడి కన్ను రెప్ప వేయలేకపోతున్నాడు.. నవ్వినప్పుడు పెదాలు కేవలం ఎడమవైపు తప్ప కుడివైపుకు కదిలించలేకపోతున్నాడు.. ముక్కులో కుడివైపు రంధ్రం కదలిక లేదు. తాను రామ్‌సే హంట్ సిండ్రోమ్ బారినపడటం వల్లే ఇలా పక్షవాతం బారినపడినట్లు బీబర్ తెలిపాడు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నందునా.. తన షోలను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జస్టిన్ బీబర్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. 

జస్టిన్ బీబర్ పక్షవాతం బారినపడటం అతని అభిమానులను షాక్‌కి గురిచేస్తోంది. బీబర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాను పక్షవాతం బారినపడినట్లు చెబుతూ బీబర్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాలో బీబర్ వీడియోకి ఇప్పటికే 2 కోట్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

రామ్‌సే హంట్ సిండ్రోమ్ అంటే ఏమిటి ..?

రామ్‌సే హంట్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. సాధారణంగా చెవి లేదా నోటి భాగంలోని నరాలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ముఖ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ పక్షవాతం బారినపడినవారిలో ఒకవైపు ముఖ కవళికలు ఉండకపోవచ్చు. ప్రస్తుతం బీబర్ ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. కొన్నిసార్లు వినికిడి లోపం కూడా రావొచ్చు. పిల్లలు, పెద్దల్లో చికెన్‌పాక్స్ వ్యాధికి కారణమయ్యే వైరసే ఈ రామ్‌సే హంట్ సిండ్రోమ్‌కి కూడా కారణం. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ప్రతీ 1 లక్ష మందిలో ఐదు నుంచి 10 మంది మాత్రమే రామ్‌సే సిండ్రోమ్ బారినపడుతారు. ఈ సిండ్రోమ్ బారినపడితే.. చెవి వద్ద ఎర్రని దద్దురు ఏర్పడుతుంది.

 

Also Read: KTR ON BJP: బీజేపీ నేతలు సత్య హరిశ్చంద్రుడి బంధువులా? సీబీఐ, ఈడీ దాడులపై కేటీఆర్ సెటైర్..

Also Read: TRS Corporator Attack: కారుతో బైకులను ఢీకొట్టి.. ప్రశ్నించిన ఆడవాళ్లపై దాడి! టీఆర్ఎస్ కార్పొరేటర్ దౌర్జన్యం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News