Pope Francis Life Journey: క్రైస్తవులకు క్రిస్మస్ తర్వాత గుడ్ ఫ్రైడే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం రోజు ఏసు క్రీస్తు తిరిగి వచ్చాడనే నమ్మకంతో క్రైస్తవులు ఈస్టర్ ను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత రోజు రోమన్ క్యాథలిక్ మత గురువైన పోప్ ఫ్రాన్సెస్ కన్నుమూయడం విషాదకరం. ఎక్కడో లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనాలో పుట్టి క్రైస్తవుల అత్యున్నత మత గురువు పోప్ అయ్యారు. ఈయన వయసు 88 సంవత్సరాలు. ఫిబ్రవరి 14 న న్యూమెనియాతో రోమ్ లోని జెమిల్లీ హాస్పిటల్ లో చేరిన పోప్ అప్పటి నుంచి చికిత్స తీసుకుంటునే తుది శ్వాస విడిచారు.
పోప్ ఫ్రాన్సెస్ దక్షిణ అమెరికా ఖండములోని లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో 1936 ఏసు క్రీస్తు పుట్టిన డిసెంబర్ నెలలోనే 17వ తేదిన జన్మించారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో అప్పటి పోప్ బెనెడిక్ట్ 16న రాజీనామా చేయడంతో 2013 మార్చి 13న 266వ కేథలిక్ చర్చి పోప్ గా ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా దేశం నుంచి అత్యున్నత పోప్ అయిన మొదటి వ్యక్తి. అంతేకాదు మొట్ట మొదటి జెస్యూట్ పోప్. ఫ్రాన్సిస్ అనే పేరు తీసుకున్న ఫస్ట్ మ్యాన్. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. ముందుగా మోకాల్ల నొప్పులు.. ఆ తర్వాత పెద్ద పేగు సర్జరీ ఇలా ఒకదాని వెంట ఒకటి అనారోగ్యాలు ఆయన చుట్టుముట్టాయి.
పోప్ ఫ్రాన్సిస్.. సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిలోసోఫికల్, థియోలాజికల్ లో డిగ్రీ చదివారు. చదువుకుంటున్న సమయంలో సైంటిస్ట్ కావాలనుకున్నారు. కానీ చివరకు బిషప్ అయ్యారు. ఈయన 1973- 1979 మధ్య అర్జెంటీనా సోసైటీ ఆఫ్ జీసెస్ కు ఛీప్ గా పనిచేశారు. 1992-97 మధ్య యాక్సిలరీ బిషప్ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ గా పనిచేశారు. 1992-1997 మధ్య టైటులర్ బిషప్ ఆఫ్ ఆకాకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1998-2013 మధ్య బ్యూనస్ ఎయిర్స్ ఆర్ బిషప్ గా పనిచేశారు. 2001-2013 మధ్య కార్డినల్ ప్రీస్ట్ ఆఫ్ సాన్ రాబర్టూ బెల్లర్మినో గా పనిచేసారు. 1998- 2013 మధ్య ఆర్డినరీ ఫెయిత్ ఫుల్ ఈస్టర్న్ రైట్స్ ఆఫ్ అర్జెంటీనా గా పనిచేశారు. 2005-2011 మధ్య ప్రెసిడెంట్ ఆఫ్ అర్జెంటీనా ఎపిస్కోపికల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా పనిచేసారు. 2013 నుంచి రోమన్ క్యాథలిక్ వాటికన్ బిషప్ గా చనిపోయే వరకు కొనసాసారు.
పోప్ ఫ్రాన్సిస్ తన జీవిత పర్యంతం.. సామాజిక న్యాయం, పేదలకు సేవ, క్యాథిలిక్ చర్చిలో పలు సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు. ముఖ్యంగా ఆదాయ అసమానతలతో పాటు.. వాతావరణ మార్పులపై పోరాడారు. ప్రపంచ వ్యాప్తంగా విధిస్తున్న మరణ శిక్షలపై మాట్లాడిన తొలి పోప్ గా నిలిచారు. అంతేకాదు వలసదారులు, శరణార్థులపై అపార కరుణ చూపాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చారు. అంతేకాదు వివిధ మతాల మధ్య ఉన్న అపోహలను తెలిగించే ప్రయత్నం చేసి గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాల విశ్వాసాలను పరస్పరం గౌరవించాలని పిలుపునిచ్చారు.
ఇక దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 1.4 బిలియన్ క్యాథిలిక్ క్రిష్టియన్స్ కు మత పెద్దగా వ్యవహరిస్తూన్న ఈయన అనారోగ్యంతో కన్నుమూయడంతో తదుపరి పోప్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









