PM Modi in Cyprus: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన విదేశాంగ విధానంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని దేశాల్లో పర్యటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రాబల్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు. అందుకు దౌత్యాన్నే నమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో కీలక దేశమైన సైప్రస్ లో పర్యటించి టర్కీ, అజర్ బైజాన్ లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రీసెంట్ గా మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా.. పాకిస్థాన్ కు యూరేషియలోని తుర్కియా, అజర్ బైజాన్ లు మద్ధుతు తెలిపాయి. అటు చైనా కూడా ఆ దేశానికి తన వంతు సాయం చేసింది. అటు కపట బుద్దితో ప్రవర్తించే అమెరికా కూడా మన సాయం చేస్తున్నట్టు నటిస్తూనే దాని యుద్ధ అవసరాల రీత్యా పాకిస్థాన్ కు పరోక్ష మద్దతు తెలిపింది.
ముఖ్యంగా మధ్యదర ప్రాంతంలో తుర్కియా విస్తరణ వాదాన్ని అడ్డుకోవడానికి భారత్ కు సైప్రస్ ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో మధ్యధర సముద్ర ప్రాంతంలో భారత్ ప్రాబల్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాదు ప్రపంచ రవాణాలో దాదాపు 50 నుంచి 60 శాతం సరకు రవాణా మధ్యధర సముద్రం గుండా జరగుతుంది. ఈ నేపథ్యంలో సైప్రస్ తో స్నేహ హస్తం చాచడం ద్వారా తుర్కియే, అజర్ బైజాన్ లతో పాటు పాకిస్థాన్ ఇండైరెక్ట్ చైనా చెక్ పెట్టే యోచనలో భారత్ ఉంది.
సైప్రస్ దేశం యూరోపియన్ యూనియన్ సభ్యదేశం.గతంలో ఈ దేశంలోని కొంత భూ భాగాన్ని తుర్కియా దుర్మార్గంగా ఆక్రమించింది. ప్రధాని నెహ్రూ హయాంలో పీవోకేకు పాకిస్థాన్ ను ఆక్రమించినట్టు తుర్కియా ఆ దేశంలో కొంత భాగాన్ని ఆక్రమించింది. దీంతో ఇరు దేశాలమ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి ‘గ్రీన్ లైన్’ పేరిట బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాని ఈ నెల 15న ముందుగా తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుగా సైప్రస్ ను సందర్శించారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి సూచించిన గ్రీన్ లైన్ ను ప్రధాని మోడీ సందర్శించి తుర్కియా విస్తరణ వాదాన్ని ప్రపంచానికి ఎత్తి చూపారు. అంతేకాదు సైప్రస్‌కు తాము అండగా ఉంటామని క్లియర్ కట్ సంకేతం ఇచ్చారు.
కేవలం 10 లక్షల జనాభా ఉన్న చిన్న ద్వీప దేశాన్ని సందర్శించడం వెనక పెద్ద మతలబే ఉంది. ఈ పర్యటన ద్వారా తుర్కియాకు గట్టి హెచ్చరికనే పంపించారు. ఇరు దేశాల మధ్య భారత్, పాక్ మాదిరే ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ.. ప్రధాని ఈ చిన్న దేశాన్ని సందర్శించడం వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది. సైప్రస్ కు అండగా నిలవడం ద్వారా మధ్యధర సముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడమే దీని ఉద్దేశ్యమే.
యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సైప్రస్‌తో దోస్తి ఉపయోగపడుతుంది. ఇది భారతదేశానికి ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ అనే ఓ చిన్న దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ ఎక్స్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. మధ్యదరా సముద్రంలో చిన్న ద్వీప దేశమైన సైప్రస్ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఆ మాటకొస్తే మన దేశాధినేతలు కూడా సైప్రస్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో భారత్.. తనతో కలిసి వచ్చే ప్రతి దేశాన్నీ కలుపుకొని పోతోంది. అయితే సైప్రస్‌తో దోస్తీ మాత్రం అంతకు మించిన కొత్త సమీకరణలకు తెరతీయనుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియా మాదిరే అజర్‌బైజాన్ సైతం పాకిస్థాన్‌కు మద్దుతు ఇచ్చింది. ఆ దేశానికి వైరీ పక్షదేశమైన ఆర్మేనియా సైతం భారత్‌తో ఫ్రెండ్ షిప్ కోసం ఎదురు చూస్తోంది. ప్రధాని మోడీ త్వరలోనే అర్మేనియా దేశంలోనూ పర్యటించే అవకాశాలున్నాయి. 1982లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. 2002లో అటల్ బిహారి వాజ్ పేయ్ తర్వాత 23 యేళ్లకు0 ఆ దేశాన్ని సందర్శించిన మూడో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు.
తుర్కియే విషయానికొస్తే..పాము గుర్తుకు రాకమానదు. దానికి ఎన్ని పాలు పోసిన అది కక్కేది విషమే. గతంలో గతంలో తుర్కీయేలో భారీ భూకంపం సంభవిస్తే.. ‘ఆపరేషన్ దోస్త్’తో భారత్ అండగా నిలిచింది. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ దేశం మన దేశం చేసిన సాయాన్ని మరిచి పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించింది. అంతేకాదు మనపై దాడులకు డ్రోన్లను సైతం పాక్ కు అందించింది. ఇప్పుడు తుర్కియేకు కీలెరిగి వాత పెట్టినట్టు ఓ గట్టి సందేశం ఇవ్వడం కోసం ప్రధాని మోదీ సైప్రస్‌లో పర్యటించి ఆ దేశానికి ఇండైరెక్ట్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
తుర్కియే, సైప్రస్ రెండు దేశాల మధ్య వైరం ఉంది. 1974లో సైప్రస్ మీద దాడి చేసిన తుర్కియే.. ఆ దేశంలో మూడో వంతు భూభాగాన్ని ఆక్యుపై చేసింది. అప్పటి నుంచి తుర్కియే అంటే సైప్రస్‌కు అసలు పడదు. అలాంటి సైప్రస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటనలో భాగంగా వెళ్లిన తొట్టతొలి దేశం ఇదే కావడం గమనార్హం. దీంతో తుర్కియోకు దాని భాషలోనే గట్టి సందేశం ఇచ్చారు ప్రధాని మోడీ. తుర్కియో గనుక సైప్రస్ జోలికొస్తే.. భారత్ తనకు అండగా ఉంటుందనే భరోసా సైప్రస్‌కు దక్కినట్టైంది.
అత్యంత శక్తివంతమైన సైనిక శక్తుల్లో ఒకటిగా ఎదుగుతోన్న భారత్‌తో స్నేహం చేయడం అనేది సైప్రస్‌కు ఎక్కడలేని బలం అని చెప్పాలి. . భారత్‌తో మరింత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ఉన్న సైప్రస్.. మన దేశ ప్రధానిని వాళ్ల దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’తో గౌరవించింది.
సైప్రస్ కు అండగా నిలవడం వల్ల కలిగే వ్యూహాత్మక ప్రయోజనాలు..
సైప్రస్.. మద్యధర సముద్ర ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరంగానే కాకుండా ఆర్థికంగా భారత్ కు ఎంతో ప్రయోజనకరం. తుర్కియో, సిరియాలకు దగ్గరగా ఉండే సైప్రస్ భౌగోళికంగా ఆసియా ఖండంలో ఉన్నట్టుగా ఉన్నా.. అది యూరోప్ ఖండంలో వ్యాపించి ఉంది. సైప్రస్ దేశానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఉంది. వెస్ట్రన్ కంట్రీస్ తో దానికి మంచి రిలేషన్స్ మెయింటెన్ చేస్తోంది.
సంబంధాలే ఉన్నాయి. అంతే కాదు 2026లో ఈయూ అధ్యక్ష పదవిని చేపట్టనుంది. అంటే యూరోపియన్ దేశాలతో మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సైప్రస్ఉపయోగపడనుంది. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా ఈ ద్వీప దేశం మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన కు దాయాది దేశం పాకిస్థాన్ తో సరిహద్దు ఉగ్రవాదం, అంతేకాదు కశ్మీర్ అంశంతో పాటు యునైటైడ్ నేషన్స్ లో భద్రతా మండలిలో భారత్ కు పర్మిమెంట్ మెంబర్ షిప్ విషయంలో సైప్రస్ మనకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంటూ వస్తోంది. 1945లో స్టార్ట్ అయిన ఐక్యరాజ్యసమితిలో కేవలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, చైనాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది. మరోవైపు భారత ప్రధాని ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలను విస్తరించాలని ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. తాజాగా మన దేశంలో పాకిస్థాన్ పహల్గామ్ జరిగిన దాడిని సైప్రస్ ఖండించింది. మరోవైపు పాక్ సీమాంతర ఉగ్రవాదం విషయాన్ని ఈయూలో లేవనెత్తుతుందని చెప్పింది.
సైప్రస్ వల్ల మధ్యధర ప్రాబల్యం..
సైప్రస్ దేశంతో దోస్తీవల్ల ప్రపంచ రవాణాకు ఎంతో కీలకమైన మధ్యధరా సముత్రంలోని కీలక ప్రాంతాల్లో మన దేశం ప్రాబల్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. సైప్రస్‌లో ఆర్థిక సేవల రంగంపై ఎంతో అభివృద్ది చెంది ఉంది. టాక్స్ విధానాలు ఎంతో పారదర్శకంగా ఉన్నాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో భారత కంపెనీలు ఐరోసా మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఇది అత్యంత అనువైన చోటుగా ప్రపంచ వాణిజ్య ప్రముఖులు పేర్కొంటున్నారు. భారతదేశ వ్యాపారాలకు ఈయూలో గేట్ వేగా సైప్రస్ మారే అవకాశం ఉంది. సైప్రస్‌లోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన యూరో బ్యాంక్, ముంబైలో ఆఫీసును స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెట్టే విషయంలో సైప్రస్ కీలక రూల్ పోషించనున్నట్టు ఈ భేటిలో పేర్కొంది. రెండు దేశాల మధ్య డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) ఉంది. తూర్పు మధ్యధరా ప్రాంతంలోని నిక్షేపాల నుంచి సహజ వాయువును వెలికి తీయడంలో సైప్రస్ కీ రూల్ పోషిస్తోంది. తుర్కియే తవ్వకాల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భవిష్యత్తులో భారత్, సైప్రస్ మధ్య ఎనర్జీ సెక్టార్‌లో భాగస్వామ్యానికి ఛాన్సెస్ ఉన్నాయి.మన సహజవాయువు అవసరాలను తీర్చడానికి సైప్రస్ ఉపయోగపడే అవకాశం ఉంది.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook