)
Modi Vs Trump: నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ నిన్నటి మొన్నటి ప్రాణ స్నేహితుల్లా మెలిగారు. ఇపుడు శత్రువుల్లా కలబడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్.. మోడీని గొప్ప ప్రధాని అంటూ పొగడటంతో దానికి మోడీ స్పందించారు. ముఖ్యంగా భారత్-అమెరికా బంధం చాలా సానుకూలమైందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉంటామని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
అంతేకాదు ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇరు దేశాల సంబంధాలపై కూడా సానుకూల పరిణామాలను అభినందించారు. భారత ప్రధాని మోడీతో మంచి స్నేహం ఉందని..ఆయన గొప్ప ప్రధానమంత్రి అని ట్రంప్ అన్నారు. ఇద్దరం ఎల్లప్పుడూ స్నేహితులమేనని చెప్పుకొచ్చారు. కాకపోతే ఈ ప్రత్యేక సమయంలో మోడీ చేస్తున్నదే తనకు నచ్చడం లేదన్నారు. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న బంధం మాత్రం చాలా ప్రత్యేకమైందని వెల్లడించారు. చింతించాల్సిన పని లేదని.. అప్పుడప్పుడు విభేదాలు సహజంగా జరుగుతుంటాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.
చైనా కారణంగా భారత్, రష్యాను కోల్పోయామనన్నారు. ఆ రెండు దేశాలు చైనా చీకటిలోకి వెళ్లిపోయామని ఇటీవల చైనాలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను తన సొంత సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ..మోడీ మంచి స్నేహితుడని..రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
భారత్‌పై ట్రంప్ ముందు 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకాలు విధించినట్లు బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై అత్యధికంగా 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్.. మోడీపై వ్యాఖ్యలు చేయడం.. దానికి ప్రధాని సానుకూలంగా స్పందించడం భౌగోళికంగా రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.