)
Go Back India Video: ఐర్లాండ్ లో జాత్యహంకార ధోరణి పరిధిని దాటుతోంది. కేరళకు చెందిన ఆరేళ్ల బాలికపై స్థానికంగా ఉండే కొంతమంది అబ్బాయిలు చుట్టుముట్టి డర్టీ ఇండియా, గో బ్యాక్ అంటూ ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ పార్టులో సైకిల్‌తో దాడి చేశారు. అయితే, వీళ్ల గుంపులో ఒక బాలిక కూడా ఉంది. ఆమె తల్లి తన 10 నెలలకు బాబుకు ఇంట్లో ఫుడ్ పెట్టడానికి వెళ్ళిన సమయంలో ఇంతలోనే ఆ ఘోరం జరిగింది. బాలిక ఏడుస్తూ అరుపులు వినిపించడంతో ఆమె ఒక్కసారిగా బయటికి వచ్చి చూసి షాక్‌కు గురైంది.
ప్రధానంగా ఈ దాడిలో 14 ఏళ్లలోపు ఉన్న అబ్బాయిలు ఉన్నారు. ఈ 8 ఏళ్ల బాలికపై దాడి చేశారు. చిన్న నాటి నుంచే ఇలాంటి జాతి అహంకార ధోరణి ఏంటని ప్రశ్నిస్తున్నారు? డర్టీ ఇండియా అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని ఒక ఐరిష్ పత్రికతో సదరు బాలిక తల్లి చెప్పింది. ఆమె వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తుంది. ఆమె తన 8 ఏళ్ల బాలిక, కుమారుడితో కలిసి ఐర్లాండ్‌లో నివసిస్తుంది. ఐరిష్ పౌరసత్వం కూడా ఆమె కలిగి ఉంది. దాడి చేసిన తర్వాత ఆ అబ్బాయిలు అక్కడి నుంచి నవ్వుతూ తిరిగి వెళ్లిపోయారని ఆమె చెప్పింది.
మరో ఘటనలో..
మరో ఘటనలో కూడా స్థానికులు యువకుడిపై దాడి చేశారు. 'గో బ్యాక్ ఇండియా' అంటూ భారతీయ యువకుడి పై దాడి ఘటన ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగింది. స్థానికులు దాడి చేసిన ఘటన వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో క్యాథలిక్ చెందిన వ్యక్తి ఐర్లాండ్ నుంచి వెళ్లిపో అంటూ నినాదాలు చేసి సదరు యువకుడిపై దాడి చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ThisisDublin
Man attacked in Dublin last night
Not my video sent into me ?? pic.twitter.com/m8K6qjg06B— ThisisDublin (@Thisisdublin0) August 4, 2025
సదరు ఇండియన్ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని సారీ చెప్తున్న గాని వాళ్ళ వినకుండా దాడికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. తరచూ అతనిపై దాడి చేయడం దారుణంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఇండియన్ వారిపై తిరుగుబాటు కూడా చేయలేదు. కానీ, ఐర్లాండ్ జాతీయులు ఇండియన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు ఇదిలా ఉండగా డబ్లిన్‌లో జరిగిన యువకుడు దాడి జూలై 19న జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియన్స్‌పై మూడు దాడులు జరిగాయి. ఆరేళ్ల బాలికపై కూడా చిన్నారులు దాడి చేయడం మరింత వివాదాస్పదంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి