'కరోనా వైరస్'..ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. భారత దేశం సహా చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయినప్పటికీ అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనిక, పేద, పెద్ద, చిన్నా, ఆడా, మగా తేడా లేకుండా కరోనా వైరస్ అందరినీ చుట్టుముట్టేస్తోంది. లాక్ డౌన్ తో కొంత మేర సత్ఫలితాలు  కనిపిస్తున్నాయి. ఐతే కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ చేయడంతో రెక్కాడితే డొక్కాడని పేదలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఐతే అలాంటి వారి  కోసం భారత ప్రభుత్వం సహా ఇతర  దేశాల ప్రభుత్వాలు కూడా ఆహారం, నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి.


[[{"fid":"183821","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఐతే ఇలాంటి ఉచిత వస్తువుల సరఫరాలోనూ పాకిస్తాన్ కక్కుర్తి చాటుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్..POKలో  దాయాది దేశం అధికారులు సహాయం కోసం తీసుకొచ్చిన వస్తువులను అమ్ముకున్న పరిస్థితి దాపురించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని దుకాణదారులకు పాక్ అధికారులు.. తమ కోసం పంచడానికి తీసుకు వచ్చిన వస్తువులు అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా తమను ఆయా దుకాణదారుల వద్దకు వెళ్లి వస్తువులు కొనుక్కోవాలని చెప్పినట్లు మీర్ పూర్ వాసులు చెబుతున్నారు. పాకిస్తాన్ అధికారుల కుటిల బుద్ధి కారణంగా తాము ఆకలితో అలమటిస్తున్నామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..