Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. గత మూడు నెలల నుంచి  ఇరుదేశాల మధ్య వార్ సాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు, పట్టణాలు రష్యా బలగాల అధీనంలోకి వెళ్లాయి. ఇందులో సాధారణ పౌరులు సైతం మరణించారు. ఉక్రెయిన్‌లోని మరిన్ని కీలక ప్రాంతాలను రష్యా అక్రమించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌లో కీలక ప్రాంతమైన లైమన్‌ను రష్యా చేతుల్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రష్యా సైనికులు సైతం ధృవీకరిస్తున్నారు. ఐతే ఉక్రెయిన్‌ మాత్రం ఖండిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఉక్రెయిన్‌పై మాస్కో బలగాలు పట్టుసాధిస్తున్నాయి. సెవెరోడ్‌నెట్స్క్‌ కేంద్రాన్ని పుతిన్ సైన్యం చుట్టుముట్టినట్లు AFP అనే వార్తా సంస్థ వెల్లడించింది. ఈ వాదనను ఉక్రెయిన్‌ తప్పుపట్టింది. రష్యా దాడిని ఉక్రెయిన్ బలగాలు ధీటుగా సమాధానం ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. కైవ్, ఖార్కివ్‌ ప్రాంతాల్లో రష్యాను బలగాలను పొగొట్టుకుందని తెలిపారు. ఐతే ఉక్రెయిన్‌ తూర్పు భాగమే లక్ష్యంగా రష్యా దూకుడు పెంచినట్లు మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.


ఇటు క్రాస్నీ లిమాన్‌ ప్రాంతం తమ అధీనంలోకి వచ్చిందని రష్యా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఐతే దీనికి భిన్నంగా ఉక్రెయిన్‌ అధికారులు స్పందిస్తున్నారు. సెవెరోడనెట్స్క్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయని .. రష్యా సైన్యాల దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు తెలిపారు. బఖ్ముత్, అవడివ్కా, మైకోలైవ్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని వెల్లడించారు.


రష్యా సైనిక చర్యను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తప్పుపట్టారు.  తమ దేశంలో రష్యా మారణ హోమానికి పాల్పడుతోందని ఆరోపించారు. డాన్బాస్, ఖార్కివ్ ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆర్కిటిక్‌లో హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగం జరిగిన కాసేపటికే ఆయన స్పందించారు. ఏదిఏమైనా యుద్ధంలో తామే గెలుస్తామని జెలెన్‌ స్కీ స్పష్టం చేశారు. మొత్తంగా ఈఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది.


అప్పటి నుంచి నిరంతరాయంగా వార్‌ సాగుతోంది. యుద్ధంలో ఇప్పటివరకు వేలాది మంది మరణించారు. 6.6 మిలియన్ల మంది ఉక్రెయిన్‌ను వదిలి వలస వెళ్లారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓడరేవు ప్రాంతాలైన ఖెర్సన్, మారియుపోల్‌ ప్రాంతాలు పుతిన్‌ స్వాధీనంలోకి వెళ్లాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇతర దేశాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈవిషయంలో రష్యా అధ్యక్షుడు వెనకడుగు వేయడం లేదు. తమ లక్ష్యన్నా చేరుకుంటామని స్పష్టం చేశారు.


Also read: Osmania University: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయూ.. ఆరుగురు అరెస్ట్


Also read: Southwest Monsoon: భారత్‌ను పలకరించిన నైరుతి రాగం..త్వరలో భారీ వర్షాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook