Putin India Tour: వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా భారత్-రష్యా దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ నైపుణ్య కార్మికులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రష్యాలో ప్రస్తుతం నిర్మాణం, జౌళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులు, సాంకేతిక నిపుణులు అక్కడి పరిశ్రమల్లో పనిచేసే అవకాశం ఉన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
భారత్‌లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇంధన రంగం, రక్షణ ఉత్పత్తి, వ్యాపార వృద్ధి, కార్మిక మార్పిడి, విద్యా సహకారం వంటి పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పుతిన్-మోడీ సమావేశం ద్వార ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2021 తర్వాత పుతిన్ భారత్ పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. గత మూడేళ్లుగా ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ లాస్ట్ ఇయర్ రష్యాను రెండు సార్లు సందర్శించారు. మొదట జూలైలో జరిగిన ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగా, అనంతరం అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్ నగరంలో పుతిన్‌ను మరోసారి కలిశారు.
ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా ఇరువురు నేతలు కలసి పలు అంశాలపై చర్చించారు. ప్రపంచ రాజకీయ పరిణామాలు, రక్షణ, వాణిజ్యం, ఇంధన సరఫరా, అంతరిక్ష రంగాల్లో సహకారం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా నిలిచాయి.
Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!
Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









