Lashkar commander Saifullah killed: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. లష్కరే టాప్ కమాండర్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా ఖలీద్‌ను పాకిస్తాన్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ఈ దుర్మార్గుడు కుట్ర పన్నాడని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాడిన్ జిల్లా మట్లీ తాలూకాలో ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. దాడి చేసిన వారు అతనిపై కాల్పులు జరపడంతో కుక్కచావు చచ్చాడు. చాలా కాలంగా సైఫుల్లా ఖలీద్ నేపాల్‌లో లష్కరే తోయిబా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ టెర్రరిస్టు లష్కరే ఉగ్రవాదులు నేపాల్ మీదుగా భారత్ లోకి ప్రవేశించడానికి సహాయం చేసేవాడు.
ఈ లష్కరే తోయిబా కమాండర్ పేరు సైఫుల్లా ఖలీద్ అలియాస్ వినోద్ కుమార్ అలియాస్ మహ్మద్ సలీం అలియాస్ వానియాల్ అలియాస్ వాజిద్ అలియాస్ సలీం భాయ్. అతను నేపాల్‌లో లష్కర్ మొత్తం మాడ్యూల్‌ను నిర్వహించేవాడు. ఈ ఉగ్రవాది ప్రధాన పని లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు కేడర్లను అందించడం ఆర్థిక సహాయం చేయడం. 2006లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాద దాడికి కుట్ర పన్నింది ఈ గుంపునే.
Also Read: Gram Priya: గ్రామ ప్రియ స్కీంలో పాలసీ తీసుకుంటే రూ. 14.5 లక్షలు పొందే ఛాన్స్ ఎలాగంటే..?
రాంపూర్‌లోని CRPF శిబిరంపై దాడి, నాగ్‌పూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంపై దాడి, బెంగళూరులోని IISc వద్ద బాంబు పేలుడుతో సహా భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో సైఫుల్లా పాల్గొన్నాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాడిన్ జిల్లాలోని మట్లి తాలూకాలో ఆదివారం దీనిని కాల్చి చంపినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద నాయకుడు లష్కరే ఉగ్రవాదులను నేపాల్ ద్వారా భారతదేశంలోకి చొరబాట్లకు గురిచేసేవాడు. ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన ఈ దాడులు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాడు. భారత గడ్డపై లష్కరే తోయిబా కార్యకలాపాలు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాడు.
Also Read: IMF: పాకిస్తాన్ కు పదకొండు కండిషన్స్.. దాయాది దేశానికి ఐఎంఎఫ్ షాక్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.