అమెరికాలో కాల్పులు.. 11 మంది మృతి, ఆరుగురికి గాయాలు!

వర్జీనియా బీచ్: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మర్చిపోకముందే చోటుచేసుకుంటున్న మరో ఘటన అటు అమెరికన్స్‌ను ఇటు అమెరికాలో ఉపాధి కోసం వెళ్తున్న విదేశీయులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా వర్జీనియా బీచ్‌లోని మునిసిపల్ సెంటర్ వద్ద ఓ ఉద్యోగి తోటి ఉద్యోగులపైనే విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.

Last Updated : Jun 1, 2019, 04:41 PM IST
అమెరికాలో కాల్పులు.. 11 మంది మృతి, ఆరుగురికి గాయాలు!

వర్జీనియా బీచ్: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మర్చిపోకముందే చోటుచేసుకుంటున్న మరో ఘటన అటు అమెరికన్స్‌ను ఇటు అమెరికాలో ఉపాధి కోసం వెళ్తున్న విదేశీయులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా వర్జీనియా బీచ్‌లోని మునిసిపల్ సెంటర్ వద్ద ఓ ఉద్యోగి తోటి ఉద్యోగులపైనే విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. కాల్పుల ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు హింతకుడిని కాల్చిచంపారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వర్జీనియా బీచ్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్టు వర్జీనియా బీచ్ పోలీస్ చీఫ్ జేమ్స్ కర్వెరా తెలిపారు.

వర్జినియా బీచ్ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎఫ్‌బిఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు, హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్‌మెంట్ ఫోరెన్సిక్ నిపుణులు స్థానిక పోలీసులకు ఈ విచారణలో సహకరిస్తున్నట్టు జేమ్స్ వెల్లడించారు.

Trending News