Israel Hezbollah War: బీరూట్, దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు..హిజ్బుల్లా ఉగ్రవాద ప్రధాన కార్యాలయం పేల్చివేత

Israel Hezbollah War: దక్షిణ లెబనాన్‌లో జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం కూడా విడుదల చేసింది.  

Written by - Bhoomi | Last Updated : Mar 28, 2025, 10:52 PM IST
Israel Hezbollah War: బీరూట్, దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు..హిజ్బుల్లా ఉగ్రవాద ప్రధాన కార్యాలయం పేల్చివేత

Israel Hezbollah War: లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. బీరూట్ శివారు ప్రాంతంపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది. వీటితోపాటు డ్రోన్ లతో మరో మూడు హెచ్చరిక దాడులకు పాల్పడింది. నగరమంతా వీటి శబ్దాలు వినిపించడంతోపాటు దట్టమైన పొగ అలుముకుంది. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. తమపై వచ్చే బెదిరింపులను ఎదుర్కొనేందుకు ప్రతిదాడులు తప్పవు అన్నారు. ఈ క్రమంలోనే లెబనాన్ అంతటా దాడి చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. హిజ్బుల్లా సైనిక ప్రధాన కార్యాలయంపై ఈ దాడిని ఇజ్రాయెల్ ఇటీవలి గంటల్లో నిర్వహించింది. దీనిలో ఇజ్రాయెల్ వైమానిక దళ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం, దాని సైనిక మౌలిక సదుపాయాలు, లాంచర్లు, ఉగ్రవాదులను ధ్వంసం చేశాయి. 

Add Zee News as a Preferred Source

హమాస్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ విఫలమైన తర్వాత ఐడిఎఫ్ మొదట గాజాపై భీకర దాడిని ప్రారంభించింది. నిరసనగా, హిజ్బుల్లా మళ్ళీ ఇజ్రాయెల్ పై రాకెట్లను ప్రయోగించడం ప్రారంభించాడు. దీని తరువాత, ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హిజ్బుల్లా  ముఖ్యమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ దేశ పౌరులకు ఎలాంటి ముప్పునైనా తొలగించడానికి ఈ ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటూనే ఉంటామని ఐడిఎఫ్ తెలిపింది.

 

Also Read: 7 Seater Car: కార్ల మార్కెట్‎కు కొత్త కళ.. వచ్చేనెల మార్కెట్లోకి 7 సీట్ల SUV.. ధర, ఫీచర్లు లీక్  

లెబనాన్ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపిస్తున్నాను..సమీకరణాలు మారాయి. మా ప్రాంతాలపై ఎలాంటి దాడులను అనుమతించం. మీరు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయనట్లయితే మేము అమలు చేస్తాము. ఇజ్రాయెల్ కు ఎలాంటి ముప్పు ఎదురైనా లెబనాన్ లో ప్రతిచోట దాడులు చేస్తాము. ఉత్తరభాగంలో ఉన్న మా ప్రాంతవాసులంతా సురక్షితంగా తమ ఇళ్లకు చేనుకునే విధంగా చర్యలు తీసుకుంటామని నెతన్యాహు తెలిపారు. 

ఇక అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య గతనవంబర్ లో కుదిరిన కాల్పుల విరమరణ ఒప్పందాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని. లెబనాన్ నుంచి తమ విభాగంలోకి రాకెట్లు దూసుకువచ్చాయని ఇజ్రాయోల్ సైన్యం ఆరోపిస్తోంది. హిజ్బుల్లా మాత్రం తాము వాటిని ప్రయోగించలేదని కాల్పుల, విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే తాజాగా బీరూట్ పై దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలను జారీ చేసింది. 

Also Read: Olympics 2036:  భారత్​లో ఒలింపిక్స్ నిర్వహిస్తే​ ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు..పారిస్ కంటే డబుల్    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News