)
Strait of Hormuz : అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా నేరుగా రంగంలోకి దిగడంతో ఇరాన్ తనదైన శైలిలో పావులు కదిపింది. దీనికి అనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్..ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది.ముఖ్యంగా హర్మూజ్ జలసంధి .. ఇరాన్, ఒమన్ మధ్య పర్షియన్ గల్ఫ్ లో అత్యంత కీలకమైనది హార్మూజ్ జలసంధి. ప్రపంచ వాణిజ్య నౌకలకు కీలకమైన ప్రదేశం. ఇక్కడ నుంచే ఆసియన్ దేశాలతో పాటు యూరప్ కంట్రీస్ కు నిరంతరం నౌకల ద్వారా సరుకు రవాణా జరగడంలో ఈ జలసంధే కీలక పాత్ర పోషిస్తోంది.
హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో అది ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు పెరిగాయి. ఈ కొరతను ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెట్టాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రూడ్ ధరల పెరుగుతల ఇండైరెక్ట్ గా ఇతర వస్తువుల ధరలు పెరుగడంలో దోహద పడుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపులో ఉండదు.
అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు చమురు కోసం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తమ దేశంలో దాదాపు 75 రోజుల పాటు చమురు నిల్వలున్నట్టు తెలిపింది. హర్ముజ్ జలసంధి మూసివేసినా.. అందుకు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.