Return to Earth: సునీతా విలియమ్స్ విల్మోర్ ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతారు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ

Return to Earth: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరి కొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత ఎట్టకేలకు రిటర్న్ టు ఎర్త్ సుగమం కావడంతో రిటర్న్ జర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది నాసా.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2025, 01:27 PM IST
Return to Earth: సునీతా విలియమ్స్ విల్మోర్ ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతారు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ

Return to Earth: గత ఏడాది జూన్ నెలలో అంతరిక్షంలో వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమ్మీదకు పయనమౌతున్నారు. భూమ్మీదకు ఎప్పుడు ల్యాండ్ అవుతారు, ఎక్కడ ల్యాండ్ అవుతారు, ల్యాండింగ్ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ప్రత్యక్ష ప్రసారం ఉంటుందా లేదా అనే వివరాలను నాసా వెల్లడించింది. 

మరి కొద్దిగంటల్లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమికి బయలుదేరనున్నారు. స్పేస్ ఎక్స్-నాసా సంయుక్తంగా పంపించిన క్రూ 10 నిన్న మార్చ్ 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. నలుగురు వ్యోమగాములు, అన్నె మెక్ క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్‌లు ఐఎన్ఎస్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను రీప్లేస్ చేశారు. 9 నెలలుగా చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఎట్టకేలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ 9 లో భూమికి బయలుదేరనున్నారు. మరి కొద్ది గంటల్లో రిటర్న్ జర్నీ ప్రారంభం కానుంది. 

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు భూమి పైకి ల్యాండ్ కానున్నారని నాసా అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి బుధవారం మార్చ్ 19న రావాల్సిన షెడ్యూల్‌ని నాసా ఓ రోజు ముందుకు జరిపింది. భారత కాలమానం ప్రకారం మార్చ్ 19 తెల్లవారుజాము 3.27 గంటలకు ల్యాండ్ కానున్నారు.

ల్యాండింగ్ ఎక్కడ, ఏర్పాట్లు ఏం చేశారు

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న అట్లాంటిక్ సముద్రజలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుంది. ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ టీమ ఆస్ట్రోనాట్స్‌ను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తుంది. 

ల్యాండింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది

 క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ల రిటర్ని జర్నీలో స్పేస్ స్టేషన్ ఫోటోలు తీసిన 41 నిమిషాల తరువాత భూమిపైకి బయలుదేరుతుంది. 41 నిమిషాల వ్యవధిలో సోలార్ ప్యానల్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. భూమ్మీదకు ల్యాండ్ అయ్యే ముందు థ్రస్టర్ ఆన్ అవగానే క్యాప్యూల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమిపైకి వస్తుంది. ల్యాండింగ్ మరో 3 నిమిషాలు ఉందనగా 3 పారాచూట్లు తెర్చుకుంటాయి. 

ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం జర్నీని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటల నుంచి లైవ్ కవరేజ్ చూడవచ్చు. నాసా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

Also read: Sunita Williams: సునీతా విలియమ్స్ రిటర్న్ టు ఎర్త్ ప్రారంభం, వైరల్ అవుతున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News