Sunita Williams Return Journey: సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది గంటల్లో ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండ్ కావాలని వేయికన్నులతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భూ వాతావరణంలో చివరి 46 నిమిషాల్లో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. 22 ఏళ్ల క్రితం జరిగిన దుర్ఘటనలో భారతీయ వ్యోమగామి కల్పనా చావ్లా సహా ఏడుగురి దుర్మరణం కళ్ల ముందు మెదులుతోంది.
9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్షంలో వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఇద్దరినీ తీసుకుని తిరుగు ప్రయాణమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మార్చ్ 19 తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ల్యాండ్ కానుంది. దీనికోసం నాసా ఏడు ల్యాండింగ్ పాయింట్లు గుర్తించింది. ఇందులో మూడు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో, నాలుగు అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్నాయి. వాతావరణంలోని పరిస్థితుల్ని బట్టి తుపాను, గాలి దిశ, ఉష్ణోగ్రతల్ని బట్టి ఈ ఏడు పాయింట్లలో ఎక్కడ ల్యాండింగ్ అనేది నిర్ధారిస్తారు.
అత్యంత ప్రమాదకరం చివరి 46 నిమిషాలు
స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌక చివరిసారిగా రూట్ ఛేంజ్ అనేది భూ వాతావరణంలో ప్రవేశించే ముందు జరుగుతుంది. ఆ తరువాత భూమికి చేరుకునేందుకు 46 నిమిషాలు పడుతుంది. ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ. ఈ సమయంలో స్పేస్ షటిల్ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తూ ఓ అగ్ని బంతిని తలపిస్తుంది. భూ వాతావరణంలో ఘర్షణ కారణంగా అంతర్గత వేగం తగ్గుతుంది. భూ వాతావరణంలో ప్రవేశించిన తరువాత ఈ నౌకలోని క్యాప్యూల్, ట్రంక్ మాడ్యూల్ విడిపోతాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో ఇద్దరు వ్యోమగాములు విడివడిన క్యాప్యూల్‌లో ఉంటారు. చివరి 7 నిమిషాల్లో క్యాప్యూల్ నియంత్రణ చాలా కష్టమౌతుంది. అప్పుడే పారాచూట్స్ తెర్చుకోవడంతో వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్లకు పడిపోతుంది. చివరిగా సముద్రజలాల్లో క్యాప్యూల్ పడుతుంది. ఈ చివరి 46 నిమిషాల్లో లేదా చివరి 7 నిమిషాల్లో ఏ మాత్రం తేడా జరిగినా పొరపాటు జరిగినా జరిగే పరిణామం ఊహించలేనిది.
22 ఏళ్ల క్రితం ఏం జరిగింది
సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే విధంగా భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు కొలంబియా స్పేస్ షటిల్‌లో తిరిగొస్తుండగా భూ వాతావరణంలో ప్రవేశించిన తరువాత కొలంబియా స్పేస్ షటిల్ బ్రేక్ అయింది. మరో 16 నిమిషాల్లో భూమ్మీదకు ల్యాండ్ అవుతారనగా స్పేస్ షటిల్ కాలి బూడిదై మొత్తం ఏడుగురు భస్మీపటలమయ్యారు.
అంతకు ముందు 1986 జనవరి 28వ తేదీన మరో స్పేస్ షటిల్ ఛాలెంజర్ లాంచ్ అయిన కాస్పేపటికి పేలిపోవడంతో అందులో ఉన్న ఏడుగురు సిబ్బంది మరణించారు.
ఈ రెండు ఘటనల నేపధ్యంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీపై అందరు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. క్షేమంగా ల్యాండ్ కావాలని ప్రార్ధనలు చేస్తున్నారు. చివరి 46 నిమిషాల ప్రమాదకర సమయం ఎప్పుడు దాటుతుందా అని చూస్తున్నారు.
Also read: Sunita Williams Return: సునీతా, విల్మోర్ తిరిగి రాగానే ఏం జరుగుతుంది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి