Sunita Williams: సునీతా విలియమ్స్ రిటర్న్ టు ఎర్త్ ప్రారంభం, వైరల్ అవుతున్న వీడియో

Sunita Williams: అంతరిక్షంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ ఖాయమైంది. కాస్సేపటి క్రితం క్రూ 10 అంతరిక్షానికి చేరుకుంది. 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత తోటి ఆస్ట్రోనాట్స్‌ను కలుసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2025, 01:39 PM IST
Sunita Williams: సునీతా విలియమ్స్ రిటర్న్ టు ఎర్త్ ప్రారంభం, వైరల్ అవుతున్న వీడియో

Sunita Williams: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నెలల సుదీర్ఘ సమయం. వారం రోజుల్లో తిరిగొచ్చేయాల్సిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు తిరిగి భూమ్మీదకు బయలుదేరనున్నారు. మరో 3-4 రోజుల్లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు తిరిగి రానున్నారు. 

Add Zee News as a Preferred Source

గత ఏడాది జూన్ నెలలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌‌లు స్టార్‌లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షకేంద్రానికి వెళ్లారు. ఇది వాస్తవానికి 1 రోజుల షెడ్యూల్. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ఇద్దరూ లేకుండానే స్టార్ లైనర్ ఖాళీగా తిరిగొచ్చేసింది. ప్రొపల్షన్ సిస్టమ్ ధ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం వంటి సాంకేతిక కారణాలు తలెత్తాయి. ఈ ఇద్దరినీ తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ సహాయం తీసుకుంది నాసా. స్పేస్ ఎక్స్ కు చెందిన సిబ్బంది డ్రాగన్ క్యాప్యూల్ లో ఈ ఇద్దరినీ తీసుకురానుందని నాసా వెల్లడించింది. ఎట్టకేలకు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 మిషన్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అంటే మార్చ్ 14 ఉదయం 4.33 గంటలకు ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా బయలుదేరింది. ఇవాళ ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. 

క్రూ 10 మిషన్ నుంచి అంతరిక్షంలో వెళ్లిన నాసాకు చెందిన అన్నే మెక్ క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ కు చెందిన టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్ లతో కూడిన క్రూ 10 బృందం అంతరిక్షంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ను కలుసుకుంది. 9 నెలలుగా మూడో మనిషిని చూడని సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు తోటి ఆస్ట్రోనాట్స్ ను చూడగానే ఆనందంతో ఒకరికొకరు కౌగిలించుకున్నారు. త్వరలో అదే క్యాప్సూల్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి భూమ్మీదకు బయలుదేరనున్నారు. అంతరిక్షంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తో ఆస్ట్రోనాట్స్ కలుసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

క్రూ 10 ఆస్ట్రోనాట్స్ బృందం కొన్నిరోజులు అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నారు. మెటీరియల్ ఫ్లేమబిలిటీ టెస్టులు నిర్వహిస్తారు. లూనార్ నేవిగేషన్ సొల్యూషన్ పై బ్యాకప్ హార్డ్ వేర్ సిద్ధం చేస్తారు. హ్యామ్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్ధులతో మాట్లాడనున్నారు. 

Also read: Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News