Sunitha Williams: అంతరిక్షంలో కొన్ని నెలల గడిపిన తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి రానున్నారు. మిషన్ ముగిసిన తర్వాత క్యాప్సూల్ తెరిచినప్పుడు, ఇద్దరు వ్యోమగాములను నేరుగా స్ట్రెచర్‌పై తీసుకువస్తారు. నెలల తరబడి అంతరిక్షంలో గడిపిన తర్వాత వ్యోమగాములు అకస్మాత్తుగా నడవలేరు. శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇవి సమతుల్యత, కండరాలను ప్రభావితం చేస్తాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 నిమిషాలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ-10 మిషన్’లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. ఈ టైంలో పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజుల పాటు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వ్యోమగాములు నెలల తరబడి అక్కడే ఉండాల్సి వచ్చింది.
మరి నెలల తరబడి స్పేస్ స్టేషన్‌లో గడిపిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్‌లకు నాసా ఎంత జీతం ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్‌లో జీఎస్-15 కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు 2024 లెక్కల ప్రకారం.. ఏడాదికి 1 కోటీ 8లక్షల నుంచి 1 కోటీ 41 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
పరిశోధనల నిమిత్తం 9 నెలల పాటు ఐఎస్ఎస్‌లో ఉన్న ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్స్‌లకు నాసా రూ. 1 లక్షల నుంచి కోటి వరకు చెల్లించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే..సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేకపోయింది. భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది.
నాసా టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ ఇప్పుడు తిరిగి రానున్నారు. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను రంగంలోకి దించారు.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









