Sunita Williams: 9 నెలల సుదీర్ఘ విరామం తరువాత భూమ్మీదకు అడుగెడుతున్న సునీతా విలియమ్స్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాకు ఆహ్వానించారు. ప్రధాని మోదీ తరపున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు ప్రత్యేకంగా లేఖ రాయడమే కాకుండా ట్వీట్ చేశారు.
మరి కొద్ది గంటల్లో భూమ్మీదకు అడుగు పెట్టనున్న భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ రాకపై ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఈ క్రమంలో ఆమెను భారతదేశానికి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. మొత్తం ప్రపంచం సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని నిరీక్షిస్తోంది. భారత బిడ్డ క్షేమంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ లేఖలో రాశారు. వేలాది మైళ్ల దూరంలో ఉండవచ్చు గానీ మీరు మా హృదయానికి చేరువలో ఉన్నారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధాని లేఖలో ఏం రాశారంటే
నేను భారత ప్రజల తరపున శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఇవాళ ఓ కార్యక్రమంలో నేను సుప్రసిద్ధ అంతరిక్ష యాత్రికుడు మైసిమినోను కలుసుకున్నాను. మాటల్లో మీ ప్రస్తావన వచ్చింది. మేము మీ గురించి మాట్లాడుకున్నాం. మీరు చేసిన పనులపై మాకెంతో గర్వంగా ఉంది. ఆయనతో మాట్లాడిన తరువాత మీకు లేఖ రాయకుండా ఉండలేకపోయాను.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లేదా జో బిడెన్‌ను కలుసుకున్న ప్రతిసారీ మీ క్షేమ సమాచారం గురించి అడిగి తెలుసుకునేవాడిని. 140 కోట్ల భారత ప్రజలు మీ విజయాలపై ఎప్పుడూ గర్వంగా ఫీలవుతుంటారు. ఈ మధ్యన జరిగిన పరిణామాలు మీపై మా నమ్మకాన్ని, గర్వాన్ని మరింతగా పెంచాయి. మీరు వేలాది మైళ్ల దూరంలో ఉండవచ్చు గానీ మా మనసుల్లోనే ఉన్నారు. మీ మిషన్ విజయవంతం కావాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.
దివంగత దీపక్ భాయి ఆశీస్సులు కూడా మీ వెంట ఉంటాయి. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా మిమ్మల్ని, దీపక్ భాయిని కలుసుకున్న జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. మీరు తిరిగి వచ్చిన తరువాత మిమ్మల్ని ఇండియాకు ఆహ్వానించాలని చాలా ఉత్సుకతతో ఉన్నాను. భారత బిడ్డకు ఆతిద్యం ఇవ్వడం దేశానికి గర్వ కారణం. మైకేల్ విలియమ్స్‌కు హార్దిక శుభాకాంక్షలు అందిస్తున్నాను. మీరు, విల్మోర్ ఇద్దరూ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను.
Also Read: Best match Finishers: ఈసారి ఐపీఎల్ 2025లో బెస్ట్ మ్యాచ్ ఫినిషర్లు ఏయే జట్ల నుంచి ఎవరున్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









