Sunitha Williams: 286 రోజుల తర్వాత భూమి మీదకు సురక్షితంగా సునీత.. ఇప్పుడు ఎలా ఉందో వీడియో చూడండి..

Sunitha Williams Video: అంతరిక్షంలో 286 రోజులు ఉండిపోయిన సునీత విలియమ్స్ భూమి మీదకు ఎట్టకేలకు అడుగు పెట్టారు. కేవలం 8 రోజుల కోసం అని అనుకోని పరిస్థితుల్లో ఆమె 286 రోజులు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. అయినా సునీత విలియమ్స్ మాత్రం ఏ మాత్రం ధైర్యం తగ్గలేదు. ఐఎస్ఎస్ లో రోజు తన డ్యూటీ చేస్తూనే ఉంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు వచ్చిన తట్టుకొని నిలబడింది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 19, 2025, 07:13 AM IST
Sunitha Williams: 286 రోజుల తర్వాత భూమి మీదకు సురక్షితంగా సునీత.. ఇప్పుడు ఎలా ఉందో వీడియో చూడండి..

Sunitha Williams Video: తాజాగా క్యాప్సూల్ నుంచి స్ట్రక్చర్ పై బయటికి వచ్చాక అందరికీ చెయ్యి ఊపుతూ నవ్వుతూ ఆమె ముఖం కనిపించింది. ఆమెను వెంటనే వైద్య సేవలపై ఆసుపత్రికి తరలించారు 46 రోజులు పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎట్టకేలకు సునీత విలియమ్స్ భూమి మీద అడుగు పెట్టారు. సునీతతో పాటు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు వాళ్లని తీసుకురావడానికి వెళ్లిన మరికొందరు ఆస్ట్రోనాట్స్ 'క్రూ డ్రాగన్ హ్యూమన్' తెల్లవారుజామున 3:27 కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జరాల్లో దిగింది.

Add Zee News as a Preferred Source

గత ఏడాది జూన్‌లో వీళ్లు వెళ్లిన స్టార్ లైన్‌ స్పేస్ షిప్ లో సమస్యలు తలెత్తడంతో 8 రోజుల్లో తిరిగి రావాల్సినవారు 286 రోజులు అంటే దాదాపు 9 నెలలు అంతరిక్షంలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావటంతో ప్రపంచవ్యాప్తంగా హర్షిస్తున్నారు. ఆమె క్షేమంగా భూమ్మీదకు చేరుకోవాలని గుజరాత్‌తోని ఝులాసంలో ఆమె పూర్వికులు పూజలు కూడా నిర్వహించారు. సునీత రాక కోసం కుటుంబమంతా ఎదురు చూస్తుందని తన సోదరులు కూడా తెలిపారు.  యజ్ఞం చేశామన్నారు సునీత విలియమ్స్ భారత సంతతికి చెందినవారు.

సునీత విలియమ్స్‌ చేపట్టిన బాధ్యతలు..
ఈమె 1987లో అమెరికా నేవీలో చేరారు.  ఆ తర్వాత కమాండర్, డైవింగ్ ఆఫీసర్, ఎయిర్ ట్రైనింగ్ కమాండర్ గా కూడా పని చేశారు. మధ్యదార, పర్షియన్‌, గల్ఫ్, ఎర్ర సముద్రంలో కూడా సునీత విలియమ్స్ డ్యూటీలు చేశారు. భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవం కూడా సునితకు ఉంది. 1998లో నాసాల చేరిన సునీత తొలిసారిగా 2006లో ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007లో స్పేస్ లో మ్యారథన్‌ కూడా చేసిన తొలి వ్యక్తిగా కూడా సునీత విలియం రికార్డు సాధించారు.

అయితే, అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్‌ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్ని అనుకున్నట్లు జరిగాయి. స్పేస్ ఎక్స్, నాసా సమిష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకువచ్చామని చెప్పింది. ఈ యాత్ర విజయవంతం చేయడంతో స్పేస్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు.

 

 

Also Read:  Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశికి ఈ రోజు గడ్డుకాలం, పెండింగ్‌లో పనులు..   

మార్చి 19 తెల్లవారుజామున 3:27 గంటల నిమిషాలకు డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. నాలుగు పారాషూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకొని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో నౌక వద్దకు చేరుకొని రికవరీ వెస్సెల్‌ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సిల్ డోర్ ను ఓపెన్ చేసి సునీతతో పాటు ఇతర వ్యోమగాములను కూడా బయటకు తీసుకువచ్చారు.

ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ క్షేమంగా భూమి పైకి దిగారు. వీరి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించినట్లు నాసా తెలిపింది. అక్కడ డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి చికిత్స అందించనున్నారు. 9 నెలలు స్పేస్ లో ఉండటంతో వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read: Sunita Williams: బ్రేకింగ్ న్యూస్, సునీతాను ప్రధాని మోదీ ఆహ్వానం, మీరు ఎప్పుటికీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News