Surya Grahanam: సూర్య గ్రహణం కారణంగా కొన్ని గ్రహాల కలయికల వల్ల భూమిపై విపత్తులు సంభిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడు, సూర్యుడు బహుళ చతుర్దశి, అమావాస్య, పాడ్యమి రోజున ఒకే రేఖపై వస్తుంటాయి. ప్రతి నెల అమావాస్య రోజున అటు ఇటు ఈ గ్రహాలు ఒక రాశిలో సంచరిస్తుంటాయి. దీని వలన అంతరిక్షంలో ఆకర్షణ, వికర్షణ వల్ల పలు ఉత్పాతాలు.. సముద్రంలో ఆటు పోట్ల వంటివి సంభవిస్తుంటాయి. ఈ గ్రహాల కలయిక ప్రకృతిని శాసిస్తుంటాయి. తాజాగా మయన్మార్, థాయ్‌లాండ్ లు అమావాస్య ముందు రోజే భూపంకంతో విలవిల్లాడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీని వెనక షష్ఠ గ్రహ కూటమి ప్రభావం ఉందంటున్నారు. ముఖ్యంగా ఈ దేశాల్లో సంభవించిన భూకంపం వ్ల మృతుల సంఖ్య ఇప్పటివరకు 191 చేరినట్లు సమాచారం. వెయ్యి మంది వరకూ గాయపడినట్టు తెలుస్తోంది. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో వందలాది మంది గాయపడటంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
మయన్మార్‌లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు అపార నష్టం కలిగించాయి. ఇవి చతుర్ధశి, అమావాస్య ఘడియల మధ్య సంభవించింది. సూర్య గ్రహణం ముందు ఎఫెక్ట్ వల్ల ఈ ప్రకృతి ప్రకోపంతో ఆయా దేశాలు కంపించిపోయినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా మయన్నార్ రాజధాని నెపిడాతోపాటు మరికొన్ని నగరాల్లో కనుచూపు మేరలో ఎక్కడచూసినా కూలిన భవనాలు, బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రిక్టర్ స్కేల్‌పై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఆ తర్వాత మరో నాలుగు ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత 4.5నుంచి 6.6 మధ్యన ఉన్నట్లు మయన్మార్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య వందల్లో ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మయన్మార్‌లోని ఓ ఆస్పత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా గ్రహణం ఎఫెక్ట్ వల్ల అప్పట్లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పలువురు మరణించారు. తాజాగా ఈ గ్రహణం ప్రభావం వల్ల మయన్మార్, థాయ్ లాండ్ తో పాటు పలు దేశాల్లో భకంపాలతో పలువురు మరణించడం గ్రహణం ఎఫెక్ట్ అని చెబుతున్నారు.
ఇక గ్రహణం ముందు సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్‌లో అనేక భవనాలతోపాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతోపాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ కటించింది. విద్యుత్తు సరఫరా లేకపోవటం వల్ల సహాయక చర్యలకు ప్రతికూలంగా మారినట్లు తెలిపింది. భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలోని 1,000 పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
మయన్మార్‌లో చాలాచోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. రాజధాని నేపిడాలో చాలాచోట్ల రోడ్లు బీటలు వారాయి. కొన్నిచోట్ల భారీగా పెచ్చులు లేచాయి. దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి. అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. 2021 నుంచి మయన్మార్ సైనిక పాలనలో ఉంది. స్థానిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మయన్మార్‌లోని ఆరు రీజియన్లలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతాసాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు.
థాయ్ ల్యాండ్ లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటా ముప్పై నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. బ్యాంకాక్లోనూ నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల బహుళ అంతస్థుల భవనాల పైఅంతస్తుల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు ఎగసిపడ్డాయి. పలు అపార్ట్మెంట్లలో అలారం మోగడం వల్ల ప్రజలు బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక భవనాలు ఊగిపోయాయి. మయన్మార్, థాయ్‌ల్యాండ్ లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద క్రేన్లు, జేసీబీలతో శిథిలాలు తొలగించే పనులు కొనసాగుతున్నాయి. రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు చర్యల్లో పాల్గొంటున్నాయి.
భూకంప కేంద్రం మధ్య మయన్మార్‌లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది ‘సగాయింగ్ ఫాల్ట్’కు సమీపంలో ఉంటుంది. సాధారణంగా భూమి పైపొరలో అనేక ఫలకాలు అంటే టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. మయన్మార్‌లో ఇది దాదాపు 1200 కి.మీల మేర విస్తరించింది.
భూ ఫలకాలు ఎప్పుడూ కదులుతుంటాయి. ముఖ్యంగా గ్రహణం సందర్భంగా ఒకే రేఖపై భూమి, సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ భూకంపాలు సంభవించే అవకాశాలున్నాయిని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్‌లో ఏడాదికి 11 మిల్లీ మీటర్లు నుంచి 18 మిల్లీ మీటర్లు వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 18 మిల్లీ మీటర్లు అంటే చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటంతో.. కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే.. నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్‌లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్‌లో ఉన్న ఈ ప్రాంతంలో గత వందేళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు వచ్చినట్లు అంచనా. ఈ ప్రకృతి ప్రకోపంలో వందలాది మంది చనిపోయారు. ముఖ్యంగా ఈ భూకంపాలు.. అమావాస్య, పౌర్ణమి, గ్రహాణాల సందర్బంగా ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









