Elon Musk: ఎలాన్ మస్క్ దృష్టిలో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరంటే

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్, తనను కాకుండా అత్యంత తెలివైన లేదా తెలివైన వ్యక్తిగా భావించే మరో ముగ్గురు వ్యక్తుల పేర్లను పేర్కొన్నాడు. రిపబ్లికన్ సెనేటర్‌తో చేసిన పాడ్‌కాస్ట్‌లో, మస్క్ జెఫ్ బెజోస్, లారీ పేజ్, లారీ ఎల్లిసన్ పేర్లను పేర్కొన్నాడు.

Written by - Bhoomi | Last Updated : Mar 21, 2025, 06:37 PM IST
Elon Musk: ఎలాన్ మస్క్ దృష్టిలో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరంటే

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయ మిత్రులలో ఒకరు. ఇప్పటి వరకు తాను కలిసిన అత్యంత తెలివైన వ్యక్తులను నమ్ముతున్న ముగ్గురు టెక్ దిగ్గజాల పేర్లు వెల్లడించారు. వర్డిక్ట్ విత్ టెడ్ క్రూజ్ పాడ్ కాస్ట్ లో స్పందించిన టెస్లా సీఈవో..తాను కలిసిన అత్యంత తెలివైన వ్యక్తుల వివరాలను వెల్లడించారు. 

Add Zee News as a Preferred Source

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు ఎలన్ మస్క్. తాను ఎక్కువగా అభిమానించే సీఈవో లేదా తాను ఇప్పటి వరకు కలిసిన అత్యంత తెలివైన వ్యక్తుల వివరాలను వెల్లడించారు. ఈ జాబితా చాలా ఆసక్తిగా మారింది. అంతేకాదు మస్క్ చెప్పిన ఆ ముగ్గురు తనతోపాటు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలోని వారు కావడం గమనార్హం. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. 

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఒరాకిల్ సహావ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, గూగుల్ సహవ్యవస్థాపకుడు మొదటి సీఈవో లారీ పేజ్ లను తనకు తెలిసిన అత్యంత చురుకైన, పదునైన వ్యక్తులుగా మస్క్ ప్రశంసించారు. ఈ సందర్బంగా జెఫ్ బెజోస్ చాలా కష్టమైన, ముఖ్యమైన పనులు చేశారంటూ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడిని ప్రశంసించారు. 

ఇదే సమయంలో లారీ ఎల్లిసన్ చాలా తెలివైన వారని ఆయన తాను కలిసిన తెలివైన వ్యక్తుల్లో ఒకరని తాను చెబుతానని అన్నారు మస్క్. 2018-2022 మధ్య టెస్లా బోర్డులో పనిచేస్తున్నప్పుడు మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి 1 బిలియన్ డాలర్లు చెల్లించిన ఎల్లిసన్ తో స్పేస్ ఎక్స్ అధినేత దీర్ఘకాల బంధం కలిగి ఉన్నాడు. 

Also Read: Video: తల్లిదండ్రులను కోల్పోయిన నెల రోజుల పసికందు.. ఇజ్రాయెల్ దాడులతో గాజా గాయబ్  

ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి ఖరీదైన ఎన్విడియా జీపీయూలను పొందడంలో మస్క్ కు ఎల్లిసన్ సహాయం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరినీ తరచూ అత్యంత సన్నిహితులు అని చెబుతుంటారు. ఇదే క్రమంలో గూగుల్  సహావ్యవస్థాపకుడు ఆ సంస్థ ఫస్ట్ సీఈవో లారీ పేజ్ ను ఎలాన్ మస్క్ ప్రశంసించారు. ఒక వ్యక్తి సాధించిన విజయాలను వారి ఐక్యూపని అంచనా వేయడానికి ఉపయోగించవచ్చని తాను నమ్ముతున్నానని ఈవిషయంలో లారీ పేజ్ చాలా స్మార్ట్ అంటూ మస్క్ తెలిపారు. 

కాటా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో జెఫ్ బెజోస్, ఎల్లిసన్, లారీ పేజ్ లు వరుసగా 214, 169, 146 బిలయన్ డాలర్లుగా అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇక బ్లూమ్ బెర్గ్ జాబితాలో ఎలాన్ మస్క్ 303 బిలియన్స్ డాలర్సర్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 

Also Read: Tax-free state in India: లక్షలు సంపాదిస్తారు.. కానీ నో ట్యాక్స్.. ఈ రాష్ట్రానికి ఉన్న ప్రయోజనాలు ఇవే 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News