Pope Francis: ఉంగరం, జీతం, అంత్యక్రియలు.. పోప్‌ ఫ్రాన్సిస్‌ టాప్‌ 10 రహాస్యాలు ఇవే..

Top 10 Secrets Of Pope Francis: క్రైస్తవులకు ఆరాధ్య దైవంగా భావించే పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణించడంతో అతడికి సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన టాప్‌ 10 రహాస్యాలు.. ముఖ్యాంశాలు ఇవే.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 22, 2025, 02:55 PM IST
Pope Francis: ఉంగరం, జీతం, అంత్యక్రియలు.. పోప్‌ ఫ్రాన్సిస్‌ టాప్‌ 10 రహాస్యాలు ఇవే..

Pope Francis Secrets: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రైస్తవులకు ఆరాధ్యుడు.. క్రీస్తు సందేశం ఇచ్చే పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణంతో క్రైస్తవ లోకం మూగబోయింది. అనారోగ్యంతో అతడు మృతిచెందడంతో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు తీవ్ర సంతాపంలో ఉన్నారు. ఈస్టర్‌ పండుగ తర్వాతి రోజే అతడు మరణించడం క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పోప్‌ ఫ్రాన్సిస్‌ మృతిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పోప్‌ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన టాప్‌ 10 రహాస్యాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Heat Waves: ఉత్తర తెలంగాణ 'ఎండల' రికార్డు.. ఈ ఏడాది రికార్డు బద్దలు

పోప్ ఫ్రాన్సిస్ రహాస్యాలు ఇవే

  • శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడ్డారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. మళ్లీ అనారోగ్యానికి గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2013లో పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత ఆయన పోప్‌ ఫ్రాన్సిస్‌గా బాధ్యతలు చేపట్టారు. 12 ఏళ్లపాటు క్యాథలిక్‌ చర్చికి నాయకత్వం వహించారు.
  • పోప్‌ ఫ్రాన్సిస్‌ 1938లో అర్జెంటీనాలో జన్మించిన అతడు దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకున్న తొలి వ్యక్తి ఆయన. అతడిని ప్రజల పోప్‌గా కీర్తిస్తారు. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం సంచలనం రేపింది. ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు.
  • పోప్‌ ఫ్రాన్సిస్‌ నికర విలువ 16 మిలియన్‌ డాలర్లుగా తెలుస్తోంది. భారత కరెన్సీలో రూ.136 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయనకు అధికారిక నివాసం, ఐదు కార్లు, అంతర్జాతీయ ప్రయాణ ప్లాన్లు ఉన్నాయి.
  • పోప్‌ పదవికి అధికారికంగా నెలకు రూ.32 వేల డాలర్లు జీతం వస్తుంది. ఆయన పోప్‌ ఫ్రాన్సిస్‌ వేతనాన్ని తిరస్కరించి 2013లో పోప్‌ అయినప్పటి నుంచి చర్చికి లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. 
  • తుదిశ్వాస విడిచిన పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు 4 నుంచి 6 రోజుల్లో పూర్తి కానున్నాయి. శతాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ చనిపోతే ఇంటి తలుపులను మూసేస్తారు. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా చూసుకుంటారు.
  • పోప్‌ ఫ్రాన్సిస్‌కు ఒక ప్రత్యేకమైన రింగ్‌ ఉంటుంది. ఫిషర్‌మ్యాన్‌ రింగ్‌ పోప్‌ ఫ్రాన్సిస్‌ చేతికి ధరిస్తుంటాడు. చేతికి ఉన్న ఫిషర్‌మ్యాన్‌ ఉంగరాన్ని అందరూ ముద్దాడుతుంటారు. ఉంగరాన్ని ముద్దాడడంతోపాటు జీసస్‌ను ముద్దాడినట్లు భావిస్తుంటారు.
  • పోప్‌ పదవిలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతడి చేతికి ఉన్న ఫిషర్‌మ్యాన్‌ ఉంగరాన్ని పగలగొడుతారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ సంప్రదాయం ప్రకారమే పోప్‌ ఫ్రాన్సిస్‌ ధరించిన ఉంగరం పగులగొడుతారు.
  • పోప్‌గా ఉన్నవారు తమ సమాధి ఎక్కడ ఉండాలో ముందే నిర్ణయించుకుంటారు. తమను పలానా చోట అని మరణానికి ముందే చెబితే అక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ ముందే నిర్ణయించుకోకపోతే  తర్వాత మరణం చర్చి ప్రాంగణంలో సమాధి చేస్తారు.

Also Read: K Kavitha: 'తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు' గులాబీ శ్రేణులకు కవిత పిలుపు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News