Trump Epstein Files News: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలో ఊహించని రాజకీయ సంక్షోభం ఎదురవుతోంది. సంచలనం సృష్టించిన 'ఎప్‌స్టీన్ ఫైళ్ల' విషయంలో అటార్నీ జనరల్ పామ్ బోండి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.
జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో దాగి ఉన్న వేలాది పత్రాలను విడుదల చేసేందుకు అమెరికా న్యాయ శాఖ సిద్ధమవుతోంది. ఈ పరిణామం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ ఫైళ్లలో ఏముంది?
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి మొత్తం 6 లక్షల పత్రాలు ఉండగా, ఇప్పటివరకు సగం మాత్రమే బహిర్గతమయ్యాయి. గతంలో కనిపించకుండా పోయాయని భావించిన 50,000 కీలక పత్రాలను ఇప్పుడు న్యాయశాఖ గుర్తించింది. ఈ కొత్త పత్రాలలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందనే వార్తలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే వారంలోగా ఈ ఫైళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
అటార్నీ జనరల్ పామ్ బోండి ఈ వ్యవహారంలో తీసుకున్న స్టాండ్ చర్చనీయాంశమైంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను దాచిపెట్టి ప్రభుత్వం తనను తప్పుదారి పట్టించిందని ఆమె ఆరోపించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆమె హౌస్ కమిటీ ముందుకు హాజరుకానున్నారు.
బోండిని కమిటీ ముందు ప్రశ్నించే విషయంపై జరిగిన ఓటింగ్‌లో 24 మంది సభ్యులు అనుకూలంగా, 19 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆమె కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి అయ్యింది.
ఇప్పటివరకు వెలుగులోకి రాని ఉన్నత స్థాయి వ్యక్తుల వివరాలు ఈ 50,000 పత్రాల ద్వారా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బోండి కమిటీ ముందు సరైన వివరణ ఇవ్వకపోతే, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు యుద్ధం, అటు ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగతో అమెరికా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పత్రాల విడుదల తర్వాత అమెరికాలో మరిన్ని సంచలనాలు రేగే అవకాశం ఉంది.
Also Read: Iran Attacks US Warship: ఇరాన్ ట్యాంకర్ కూల్చిన 24 గంటల్లో అమెరికా ట్యాంకర్‌ని కూల్చేసిన ఇరాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









