Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం వేళ.. G7 సమ్మిట్‌ నుంచి అకస్మాత్తుగా అమెరికా బయలుదేరిన ట్రంప్‌..

Trump Returned To US Ahead Israel Iran War: G7 సమ్మిట్‌ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ఆఘమేఘాలపై అమెరికా తిరిగి వెళ్లారు. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్లారు. ఈరోజు ఉదయం ఆయన కెనడాలోని కాల్గరీలో ల్యాండ్‌ అయ్యారు. అయితే, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో హుటాహుటిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యూఎస్‌ తిరిగి వెళ్లిపోయారు.

Written by - Renuka Godugu | Last Updated : Jun 17, 2025, 09:32 AM IST
Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం వేళ.. G7 సమ్మిట్‌ నుంచి అకస్మాత్తుగా అమెరికా బయలుదేరిన ట్రంప్‌..

Trump Returned To US Ahead Israel Iran War: ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో G7 సమ్మిట్‌ కూడా నిర్వహిస్తున్నారు. కెనడా వేధికగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆకస్మికంగా పర్యానను విరమించుకుని అమెరికా తిరిగి వచ్చేశాడు. వెంటనే అక్కడి భద్రతి మండలితో అత్యవసర భేటీ కూడా అయ్యారు.

సోమవారం G7 వెళ్లిన ట్రంప్‌ అక్కడ కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అయితే,  పశ్చిమాసియా వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన వెంటనే ఈ సమ్మిట్‌ను కుదించుకుని తిరిగి అమెరికా వెళ్లిపోయారు. ఇక యూఎస్‌ భద్రత మండలితో అత్యవసర భేటీ కూడా నిర్వహించారు. ఇక ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు యుద్ధం నేపథ్యంలో టెహ్రాన్‌ను వెంటనే అక్కడి పౌరులు వీడాలని అమెరికా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

యుద్ధంలోకి అమెరికా?
ఇజ్రాయెల్‌ ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే పదుల సంఖ్యలో యూఎస్‌ యుద్ధ విమానాలు మిడిల్‌ ఈస్ట్‌వైపు దూసుకువచ్చినట్లు సమాచారం. ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు మద్ధతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉండగా వైట్‌హౌస్‌ రూమ్‌లో జాతీయ భద్రత మండిలిని సిద్ధంగా ఉండాలని ట్రంప్‌ ఆదేశించారు. యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.  ఇక పరిస్థితులు చూస్తుంటే ఇరానపై దాడులు మరింత తీవ్రమయ్యేల ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇక అమెరికా కూడా రంగంలోకి దిగితే పరిస్థితిలో ఎలా ఉంటాయో.. చూడాలి.

కెనడా చేరుకున్న మోదీ..
G7 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత ప్రధాని మోదీ బయలుదేరారు. ఈ సమావేశానికి ముందుగా మోదీ సైప్రస్‌ పర్యాటన ముగించుకుని కెనడా కాల్గరీలో ల్యాండ్‌ అయ్యారు. కాననాస్కీస్‌లో 51వ  సమ్మిట్‌లో G7 దేశాల లీడర్స్‌తో మోదీ భేటీ కానున్నారు. ప్రధానంగా దౌత్య సంబంధాలు, ట్రేడ్‌కు సంబంధించిన చర్చించనున్నారు.

ఈ G7 సమావేశంలో ప్రధానంగా కెనడా, జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, యూనైటెడ్‌ స్టేట్స్‌ మొత్తం ఏడు దేశాల సమూహం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొత్తం 43 శాతానికి పైగ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌కు ఈయూ, G7 అధిపతులకు కూడా ఆహ్వానం లభిస్తుంది. ఉక్రెయిన్‌, ఆస్ట్రేలియా, బ్రేజిల్‌, ఇండోనేషియా, దక్షిణ కొరియా నాయకులు కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు.

Also Read :   నేటి రాశిఫలాలు.. ఈరోజు కర్కాటక రాశివారు జాగ్రత్త, వీరికి మాత్రం డబుల్ జాక్‌పాట్..  

Also Read :   ఇజ్రాయెల్ దాడి సరైందే.. ఇరాన్‌కు ఆ గతి పట్టాల్సిందే : డొనాల్డ్‌ ట్రంప్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News